మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో నవదీప్

హైదరాబాద్ నార్కోటిక్ పోలీసుల ఎదుట హీరో నవదీప్ విచారణకు హాజరయ్యారు.మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ కేసులో భాగంగా ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.

 Hero Navdeep Attends Trial In Madapur Drug Case-TeluguStop.com

డ్రగ్స్ సప్లయర్ రామచందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా, డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ప్రశ్నించనున్నారని సమాచారం.

కాగా డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారని పోలీసులు చెబుతున్న సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు సూచనతో ఇవాళ విచారణకు హాజరు కావాలని నవదీప్ కు పోలీసులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube