టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఇప్పటికీ హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.ఈ హ్యాండ్సమ్ హీరో ఎక్స్‌పరిమెంటల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు.
కెరీర్ ప్రారంభం నుంచే ప్రయోగాత్మక సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు ఈ మన్మథుడు.ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు.
మంటి స్టార్ సినిమాలు మొదలు పెట్టిన కూడా ఈ హీరోనే అని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం సోలోగా హిట్స్ కొట్టడం కష్టమని అర్థం చేసుకున్న ఈ యువ సామ్రాట్ యంగ్ హీరోలతో కలిసి మూవీలు చేయడమే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున ఇటీవల నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమా( Bangarraju Movie ) తీశాడు.ఆ మూవీ మంచి హిట్ సాధించింది.
అలాగే రణ్‌బీర్ కపూర్‌తో కలిసి బ్రహ్మస్త్ర తీస్తే అది కూడా హిట్ అయింది.ఈ రెండు సినిమాలు నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నాతో కలిసి తీసిన మల్టీస్టారర్ మూవీ “నాసామి రంగ”( Naa Saami Ranga ) కూడా సూపర్ హిట్ అయింది.కాబట్టి మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలను లైన్లో పెట్టాడు నాగార్జున.ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం “కుబేర”( Kubera ) అనే సినిమా వస్తోంది.ఇందులో ఒక కీలకపాత్ర పోషించడానికి నాగార్జున ఒప్పుకున్నాడు.దీంతోపాటు మరో తమిళ సినిమాలో నాగార్జున నటిస్తున్నాడని తెలుస్తోంది.ఒక కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగ్ నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ తమిళ సినిమాలో ఒక కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ హీరో ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది.
ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

అంతేకాకుండా రాజమౌళి మహేష్ బాబు( Rajamouli Mahesh Babu ) కలిసి చేస్తున్న సినిమాలో నాగ్ గెస్ట్ రోల్ చేయనున్నాడని టాక్.మొత్తం మీద నాగార్జున అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.ఒకవేళ నాగార్జున నిజంగా ఈ సినిమాల్లో నటించి, అవి హిట్టయితే ఆయన మరింత బిజీ యాక్టర్ అయ్యే అవకాశం ఉంది.
ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన నాగార్జున ఇప్పుడు ఏ దర్శకుడు ఎలాంటి రోల్ ఇచ్చినా ఈజీగా చేయగలడని, ఒక యాక్టర్ గా పేరు తెచ్చుకోగలడని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.