నాగార్జున( Nagarjuna ) హీరోగా వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో వచ్చిన సినిమా భాయ్ ( Bhai movie ) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత నాగార్జున చాలా భాద పడ్డారు ఎందుకంటే మంచి హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఇలా ప్లాప్ అవడం ఆయన జీర్ణించుకోలేపోయారు.
ఈ సినిమా ని వీరభద్రం చౌదరి మొదటగా గోపీచంద్ ని హీరోగా పెట్టి తీద్దాం అనే ఆలోచనలో ఉన్నారట కానీ అనుకోకుండా
ఈ స్క్రిప్ట్ నాగార్జున దగ్గరికి వెళ్లడం ఆయన కి నచ్చడం తో నాగార్జున ని హీరోగా పెట్టి తీశారు.ఈ సినిమా డైమండ్ రత్నబాబు డైలాగ్స్ రాసారు…ఇప్పుడు గోపీచంద్ అభిమానులు మాత్రం గోపీచంద్ ఈ సినిమా చేయకుండా ఉన్నదే బెటర్ అయింది ఎందుకంటే ఈ సినిమా వల్ల ఆయన కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేది అని ఈ సినిమా చూసిన వాళ్ళు అనుకున్నారు…

ఆలా గోపీచంద్ ( Gopichand ) ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నారనే చెప్పాలి.ఈ సినిమాకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలీదు కానీ ఈ సినిమా అసలు ఎవ్వరికి నచ్చలేదు అనే చెప్పాలి.ఈ సినిమా తరువాత వీరభద్రం గారు ఆది తో చుట్టాలబ్బాయి అనే సినిమా చేసారు అయినప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు అనే చెప్పాలి…ప్రస్తుతం ఆయన ఇంకో సినిమా చేసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆయన చేసే సినిమాలు కామెడీ సినిమాలు కావడం తో

ఆయనకి ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు…ఒకవేళ ఆయన కనక సినిమా చేస్తే ఎవరిని అయినా కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమా చేయాలే తప్ప ఇప్పుడున్న హీరోలు అయితే ఛాన్స్ ఇచ్చే పొజిషన్ లో లేరు ఒక సినిమా తీసి మళ్లి తనను తాను ప్రూవ్ చేసుకుంటే మళ్లి తనకి మంచి అవకాశాలు వస్తాయి అనే చెప్పాలి…చూద్దాం మరి ఆయన తొందర్లోనే సినిమా తీసి మళ్లి బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో…
.







