ఒకరి మూవీ సీక్వెల్ ఒకరు చేస్తున్నారు ? ఇంతకీ ఆ సీక్వెల్ మూవీ ఏమిటి ?

కార్తీ నటించిన ఆవారా సినిమా హీరో కార్తీ సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకం .లవ్ సినిమాల స్పెషలిస్ట్ డైరెక్టర్ లింగస్వామి డైరెక్షన్ లో హీరో కార్తీ నటించిన రొమాంటిక్ యాక్షన్ సినిమా ఆవారా.

 Hero Arya In Director Lingu Swamy Karthi Awara Movie Sequel Details, Awara Movie-TeluguStop.com

ఆవారా సినిమాకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది .అసలు ఏప్రిల్ 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆవారా సినిమా గురుంచి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ? అనేగా మీ డౌట్ , ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.ఇక అసలు విషయానికి వస్తే .హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ,కొంత మంది డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు హిట్ అయినా ,యావేరేజ్ అయినా ప్రేక్షకులు స్టోరీకి కనెక్ట్ అవుతే సినిమాను మల్లి మల్లి చూస్తుంటారు.ఇక హీరో కార్తీ కెరియర్ చూసినట్లు అయితే మొదటగా డైరెక్టర్ మణిరత్నం డైరెక్ట్ చేసిన యువ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు ,ఒక చిన్న రోల్ లో నటించారు.

యువ సినిమాతో నటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో కార్తీ .ఆ తరువాత తాను వెనుతిరిగిచూసుకోలేదు ,యువ సినిమా తరువాత పరుత్తివీరన్ , యుగానికి ఒక్కడు వంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు .యుగానికి ఒక్కడు సినిమా తరువాత హీరో కార్తీ – డైరెక్టర్ లింగుస్వామి తో లవ్ స్టోరీ గా ఆవారా సినిమా లో నటించారు .సింపుల్ లవ్ స్టోరీ , హీరో కార్తీ స్క్రీన్ ప్రెజెన్స్ ,తమన్నా గ్లామర్ ,యువన్ శంకర్ రాజా మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , డైరెక్టర్ లింగు స్వామీ టేకింగ్ , కామెడీ సీన్స్ , లవ్ సీన్స్ , ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది.ఈ సినిమా 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా ను మాత్రం ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు.

Telugu Awara Seequel, Lingu Swami, Arya, Karthi, Karthi Awara, Lingu Swamy, Tama

ఇక ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి ,ముఖ్యంగా హీరో కార్తీ -హీరోయిన్ తమున్నా మధ్య వచ్చే లవ్ సాంగ్స్ , రొమాంటిక్ లవ్ సీన్స్ కు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి .ఈ సినిమా అప్పట్లో మాంఛి మ్యూజికల్‌ హిట్‌ అయింది.ఓ క్యాబ్‌ డ్రైవర్‌కి, అందులో ట్రావెల్‌ చేసిన అమ్మాయికి మధ్య ఏర్పడ్డ బాండింగ్‌తో రిలీజ్‌ అయింది.ఇక ఈ సినిమా గురుంచి ఎంత మాట్లాడుకున్నా తక్కువే .లింగుస్వామి డైరక్షన్‌లో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సీనిమాకు ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది .ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది.తాజగా ఆవారా మూవీకి సీక్వెల్‌ చేయాలనుకుంటున్నారట డైరెక్టర్ లింగుస్వామి.అయితే ఈ సినిమా సీక్వెల్‌ లో హీరోగా కార్తీ ప్లేస్లో హీరో ఆర్యని ఫిక్స్ చేశారు డైరెక్టర్ లింగుస్వామి.

Telugu Awara Seequel, Lingu Swami, Arya, Karthi, Karthi Awara, Lingu Swamy, Tama

రీసెంట్‌గా కథ విన్న హీరో ఆర్య కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .సో ఆవారా సినిమా సీక్వెల్ చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ లింగు స్వామి కి ఎందుకనగా లాస్ట్ ఇయర్‌ రామ్‌తో తెరకెక్కించిన వారియర్‌ సినిమా ఫ్లాప్‌ కావడంతో, ఆవారా మూవీ సీక్వెల్‌ మీద మరింత ఫోకస్ తో ఉన్నారు డైరెక్టర్ లింగు స్వామి .ప్రస్తుతం డైరెక్టర్ లింగు స్వామి రేస్ లో వెనుకబడ్డారు .యంగ్ హీరో రామ్ తో తెరకెక్కించిన వారియర్‌ సినిమా డిసాస్టర్ తో లింగు స్వామి తన నెక్స్ట్ సినిమా మీద చాలా ఫోకస్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు .మొత్తానికి ఆవారా సీక్వెల్ మూవీ తో గట్టి కమ్ బ్యాక్ అయితే చాలా మంచి విషయమే .ఇక ఫైనల్ ఈ ఆవారా సినిమాకు సంబంధించి డైరెక్టర్ లింగు స్వామి ఈ సీక్వెల్ లో హీరో కార్తీ కి బదులుగా హీరో ఆర్య తీసుకుంటున్నారు అనే విషయం లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాలసిందే .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube