ఖర్జూరం గింజలను పారేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు!

ఖర్జూరం.( Dates ) మధురమైన రుచిని కలిగి ఉండడం వల్ల దాదాపు అందరూ తినేందుకు ఇష్టపడతారు.

అయితే ఖర్జూరం తినే సమయంలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే గింజలను( Date Seeds ) పారేయడం.మీరు కూడా ఖర్జూరం గింజలను ఎందుకు పనికి రావని డస్ట్ బిన్ లోకి తోసేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలిస్తే తప్పక మీరు షాక్ అవుతారు.నిజానికి ఖర్జూరం మాత్రమే కాదు ఖర్జూరం గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఖర్జూరం గింజల్లో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.అందుకే ఖ‌ర్జూరం గింజ‌ల‌ను పారేయ‌కూడ‌ద‌ని అంటున్నారు.మ‌రి ఖ‌ర్జూరం గింజ‌ల‌ను ఎలా ఉప‌యోగించాలి? అస‌లు వాటి ప్ర‌యోజనాలు ఏంటి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Here The Reasons Why You Should Not Throw Away Date Seeds Details, Date Seeds,

ముందుగా ఖర్జూరం గింజలను వాటర్ లో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఖర్జూరం గింజలను వేసి చిన్న మంటపై దాదాపు పదినిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ఖర్జూరం గింజలను మెత్తగా దంచి పొడి చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

Advertisement
Here The Reasons Why You Should Not Throw Away Date Seeds Details, Date Seeds,

ఈ ఖర్జూరం గింజల పొడిని రోజుకు ఒక స్పూన్ చొప్పున గోరువెచ్చని పాలల్లో( Milk ) కలిపి తీసుకోవచ్చు.లేదా స్మూతీలు లేదా హెల్త్ డ్రింక్స్‌లో యాడ్ చేసుకోవ‌చ్చు.

కాఫీ పౌడ‌ర్ కు( Coffee Powder ) ఖ‌ర్జూరం గింజ‌ల పొడిని ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించవచ్చు.

Here The Reasons Why You Should Not Throw Away Date Seeds Details, Date Seeds,

ఖ‌ర్జూరం గింజ‌ల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నియంత్రించి, క్యాన్సర్, గుండె జబ్బులు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌తాయి.ఖర్జూరం గింజల పొడి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.అందువ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారు నిత్యం ఖ‌ర్జూరం గింజ‌ల పొడిని తీసుకోవ‌చ్చు.

అలాగే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వ‌ల్ల‌ ఖ‌ర్జూరం గింజ‌లు ఆటో ఇమ్యూన్ వ్యాధులను తగ్గించగల‌వు.ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడతాయి.ఖర్జూరం గింజల పొడిని పాల‌ల్లో కలిపి తాగడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నీర‌సం, అల‌స‌ట ప‌రార్ అవుతాయి.రోజూ ఖ‌ర్జూరం గింజ‌ల పొడిని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపడుతుంది.

Advertisement

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఉన్నా దూరం అవుతుంది.

తాజా వార్తలు