ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం భారీగా పట్టుబడింది.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సోదాలలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న నాలుగు బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన గోల్డ్ విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







