ఛత్తీస్గఢ్ – తెలంగాణ( Chhattisgarh , Telangana ) సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ క్రమంలో పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ములుగు జిల్లా( Mulugu ) వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంతరం ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అయితే గత నాలుగు రోజుల క్రితం బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారన్న విషయం తెలిసిందే.