అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
విచారణలో భాగంగా చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వపరాలపై ఆయన వివరణ ఇచ్చారు.
రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైనల్ అలైన్ మెంట్ జరిగి ఆరేళ్లు అవుతున్నా ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని లూథ్రా ప్రశ్నించారు.
అటు సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.