టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ( AP High Court )బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ( AP CID ) చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా.దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో రోహత్గి వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.







