టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.ఈ మేరకు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ నేపథ్యంలో చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్దార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.అటు సీఐడీ తరపున లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సెక్షన్ 17 ఏ పై న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి.జూలై 2018కి ముందు జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని హైకోర్టు చెప్పడం సరికాదని న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు.
దర్యాప్తు ప్రారంభమైన తేదీ నుంచి సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్న ఆయన ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని తెలిపారు.అంతేకాకుండా చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని చెప్పారు.17ఏ పరిగణనలోకి తీసుకోకుండానే అరెస్ట్ చేశారన్నారు.చంద్రబాబుపై కేసు పూర్తిగా రాజకీయ పరమైనదని కోర్టుకు తెలిపారు.
గతంలో 17ఏ విషయంలో సుప్రీం తీర్పులున్నాయన్న హరీశ్ సాల్వే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా విచారణ జరగవచ్చా అని ప్రశ్నించారు.







