భారత గడ్డపై జరుగునున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) టైటిల్ సాధించేందుకు 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే.సొంత గడ్డపై ప్రపంచ కప్ జరగనుండటంతో భారత జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
భారత జట్టు కచ్చితంగా టైటిల్ సాధిస్తుంది అనే నమ్మకం మొత్తం భారతీయులలో ఉంది.భారత జట్టు కూడా ఫుల్ ఫామ్ లోనే ఉంది.

భారత జట్టుకు ప్రధాన బలం స్పిన్.హోమ్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ లు కాబట్టి పిచ్ ల పరిస్థితిపై భారత ఆటగాళ్లకు అవగాహన ఉంటుంది.భారత జట్టులో షమీ, బుమ్రా, సిరాజ్ లాంటి కీలక పేసర్లు ఉన్న భారత జట్టుకు మాత్రం స్పిన్ ప్రధాన అస్త్రం కానుంది.వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడే అన్ని జట్లు భారత స్పిన్ ముందు తలవంచాల్సిందే.
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.ఈ విషయం ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో నిరూపించబడింది.భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ నే కొనసాగిస్తున్నారు.

ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా కూడా ఫుల్ ఫామ్ లోనే ఉన్నారు.ఇక భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే.రవీంద్ర జడేజా( Ravindra Jadeja ), రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్ లు తమ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట.
ఈ బౌలర్లకు ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తా ఉంది.ఇక భారత పేసర్లు కూడా బరిలోకి తెగితే ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసే సత్తా ఉంది.
భారత్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియా తో తలపడనుంది.







