ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.కేసుపై సిట్ దర్యాప్తును కాదని సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసుపై ధర్మాసనంలో ప్రతివాదుల వాదనలు ముగియగా… ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇవాళ వెలువరించే తీర్పు కీలకంగా మారనుంది.







