వింట‌ర్‌లో ముల్లంగి త‌ప్ప‌నిస‌రిగా తినాల‌ట‌..ఎందుకంటే?

వింట‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాల‌ని అనుకుంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

అటు వంటి వాటిల్లో ముల్లంగి ఒక‌టి.అవును, ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటీ.? అన్న‌ది ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.సాధార‌ణంగా మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ చ‌లి కాలంలో గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ చాలా ఎక్కువ‌.

అయితే ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులోని ఫోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ వంటి పోష‌కాలు రక్తప్రసరణ పెంచుతుంది.

మ‌రియు చ‌లి కార‌ణంగా రక్తనాళాలు కుచించుకుపోయే ప్ర‌మాదాన్ని త‌గ్గించి.గుండె జ‌బ్బుల‌ను ద‌రి చేర‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.

Advertisement

అలాగే వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డుతుంది.అయితే ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ సిస్ట‌మ్ స్ట్రోంగ్‌గా మారుతుంది.

త‌ద్వారా జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

చ‌లి కాలంలో చాలా మంది డ్రై స్కిన్ స‌మ‌స్య‌ను కామ‌న్‌గా ఎదుర్కొంటారు.అయితే ముల్లంగిని డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక‌.పొడి చ‌ర్మం నుంచి విముక్తి ల‌భిస్తుంది.

చ‌ర్మంపై మొటిమ‌లు ఏమైనా ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

అంతే కాదు, వింట‌ర్ సీజ‌న్‌లో ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ర‌క్త పోటు అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగ్గా మారుతుంది.

Advertisement

శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వంతా క‌రిగి.వెయిట్ లాస్ అవుతారు.

అదే స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు సైతం దృఢంగా త‌యారు అవుతాయి.

తాజా వార్తలు