ఒక క‌ప్పు వేపాకుల టీతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా?

వేప‌.ఈ పేరుకు భార‌తీయుల‌కు విడ‌దీయ‌లేని సంబంధం ఉంది.

యుగ యుగాల నుంచి మ‌న భార‌తీయులు వేప చెట్టు నుంచి వ‌చ్చే ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె, బెర‌డు ఇలా అన్నిటినీ అనేక విధాలుగా ఉప‌యోగిస్తున్నారు.బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు దాగి ఉండే వేప ఆరోగ్య ప‌రంగానూ, సౌంద‌ర్య ప‌రంగానూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తుంది.

ముఖ్యంగా వేపాకులు టీ ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల అనేక బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటేన్నారు నిపుణులు.వేపాకుల టీ ఎలా త‌యారు చేయాలంటే.

ముందుగా కొన్ని వేపాకుల‌ను తీసుకుని.శుభ్రం చేసి వాట‌ర్‌లో వేసి బాగా మ‌రిగించాలి.

Advertisement
Health Benefits Of Neem Leaves Tea! Health, Benefits Of Neem Leaves Tea, Neem Le

ఇలా మ‌రిగిన నీటిలో కాస్త గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత ఒక గ్లాస్‌లోకి వ‌డ‌క‌ట్టుకుని.అందులో తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

లేదా వేపాకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకుని.దాన్ని వాట‌ర్‌లో మ‌రిగించి అయినా తీసుకోవ‌చ్చు.

ఎలా తీసుకున్నా ఆరోగ్య‌మే.

Health Benefits Of Neem Leaves Tea Health, Benefits Of Neem Leaves Tea, Neem Le

ఈ వేపాకుల టీ ప్ర‌తి రోజుకు ఒక క‌ప్పు చ‌ప్పున తీసుకుంటే.మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపి ర‌క్తాన్ని శుద్ధి చేసి కాలేయాన్ని, కిడ్నీల పనితీరు మెరుగ‌య్యేందుకు స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా కాపాడుతుంది.గ్యాస్ ట్ర‌బుల్, కడుపులో మంట‌, అల్సర్లు, మలబద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు రోజుకో క‌ప్పు వేపాకుల టీ సేవిస్తే.

Advertisement

ఈ స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.అలాగే నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు రెగ్యుల‌ర్ డైట్‌లో ఒక క‌ప్పు వేపాకుల టీ చేర్చుకోవాలి.

ఇలా చేస్తే వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు దంతాలు మ‌రియు చిగుళ్ల‌లో ఉండే బాక్టీరియాను నాశ‌నం చేసి.నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది.

అయితే గ‌ర్భిణీల‌కు మ‌రియు గ‌ర్భం పొందాలి అని భావించే వారు మాత్రం ఈ వేపాకుల టీ తీసుకోరాదు.

తాజా వార్తలు