రెగ్యుల‌ర్‌గా పీనట్ బటర్ తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

పీనట్ బటర్.అచ్చ తెలుగులో పల్లీల వెన్న అని అంటారు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ పీనట్ బటర్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

పీన‌ట్ బ‌ట‌ర్ రుచిగా ఉండ‌ట‌మే కాదు.

కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, విట‌మిన్ ఇ, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, మోనో అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటుంది.అందుకే రెగ్యుల‌ర్‌గా దీనిని తిన్నా.

ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.పైగా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది.

Advertisement

ముఖ్యంగా అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డే వారు.ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకోవాలి.

త‌ద్వారా పీన‌ట్ బ‌ట‌ర్‌లో ఉండే మెగ్నీషియం ర‌క్త పోటు స్థాయిల‌ను అదుపులోకి తెస్తుంది.అలాగే రెగ్యుల‌ర్‌గా పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల మధుమేహం వ్యాధి బారిన ప‌డే రిస్క్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

పైన చెప్పుకున్న‌ట్టు పీన‌ట్ బ‌ట‌ర్ లో ప్రోటీన్ స‌మృద్ధిగా ఉంటుంది.అందు వ‌ల్ల‌, ఎవ‌రైతే ప్రోటీన్ కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్నారో.

వారు ప్ర‌తి రోజు పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకుంటే మంచిది.త‌క్ష‌ణ శ‌క్తి కావాలి అని కోరుకునే వారికి పీన‌ట్ బ‌ట‌రే బెస్ట్ అప్ష‌న్‌.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అవును, ఇత‌ర ఆహారాల‌తో క‌లిపి పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకుంటే.వెంట‌నే ఎనర్జీ బూస్ట్ అవుతుంది.

Advertisement

దాంతో మీరు యాక్టివ్‌గా, ఉత్సాహంగా మార‌తారు.

పీట‌ర్ బ‌ట‌ర్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.అందులో ఉండే పోష‌కాలు చ‌ర్మాన్ని ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉండేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.అంతేకాదు, పీన‌ట్‌ బ‌ట‌ర్ వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.బ‌రువు త‌గ్గుతారు.

మ‌రియు నిద్ర కూడా బాగా ప‌డుతుంది.అయితే మంచిది క‌దా అని పీట‌న్ బ‌ట‌ర్ ను అధికంగా తీసుకోరాదు.

త‌గిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం.

తాజా వార్తలు