ఉదయం లేవగానే పరిగడుపుతో ఈ ఆకు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..

ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు.

అది కూడా ఇంగ్లీష్ మెడిసిన్ ను ఉపయోగించకుండా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు.

ఆయుర్వేదంలో చాలా రకాల మందులను తయారు చేయడానికి ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగిస్తూ ఉంటారు.అందులో ఆయుర్వేద మొక్కలలో ప్రధానమైన మొక్కగా తులసి మొక్క కూడా ఉంది.

ఈ మొక్క పచ్చి ఆకులను నమిలి తినడం వల్ల మధుమేహంతో సహా చాలా వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉంది.ఇది ప్యాంక్రియాస్ బీటా కణాలు సరిగ్గా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

దీని కారణంగా, శరీరంలో ఇన్సులిన్ సమాన పరిమాణంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి మెరుగ్గా ఉండి మధుమేహం రాకుండా కాపాడుతుంది.

Advertisement

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను శుభ్రమైన నీటితో కడిగి నములుతూ ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.వాతావరణం మారినప్పుడు గొంతు నొప్పిని తొలగించడానికి తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ నీటిని ఫిల్టర్ చేసి, శుభ్రం చేసిన తర్వాత నెమ్మదిగా కొద్దికొద్దిగా త్రాగడం మంచిది.

ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది.మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టిసోల్‌ను తగ్గించడానికి తులసి ఆకు రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది.ఒత్తిడితో పోరాడుతున్న వారికి కూడా తులసి ఆకుల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 12 తులసి ఆకులను నమలడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.తులసి ఆకులు ప్రతిరోజు ఉదయం తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

అంతేకాకుండా తులసి ఆకుల వల్ల జలుబు, తలనొప్పి, అలర్జీ, సైనసైటిస్‌లో దివ్యౌషధంగా పనిచేస్తుంది.ఇందుకోసం ముందుగా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి.

Advertisement

ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా త్రాగడం వల్ల వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది.

తాజా వార్తలు