ఆకలితో ట్రైన్‌లో సమోసా కొన్నాడు.. తీరా తినే ముందు చూసి షాక్

చాలా మందికి ట్రైన్‌లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా కిటికీ వద్ద కూర్చుని, చుట్టూ ప్రకృతిని ఆస్వాదించడం అంటే ఎవరికైనా ఓ మధురానుభూతి.

 He Was Hungry And Bought A Samosa In The Train He Was Shocked To See It Before E-TeluguStop.com

ఇక మధ్యలో ట్రైన్‌లో విక్రయించే సమోసాలు తినడం భలేగా బాగుంటుంది.అయితే ఓ ప్రయాణికుడికి మాత్రం ఇలాంటి ఓ ప్రయాణం చేదు అనుభవం మిగిల్చింది.

ట్రైన్‌లో ఆకలి వేయడంతో ఓ వ్యక్తి సమోసాలు కొనుగోలు చేశాడు.సగం తిన్న తర్వాత ఆ సమోసాలో ఏదో ఉందని అర్ధం అయింది.

అందులో ఓ పసుపు కాగితం కనిపించగానే అతడి ఆనందం ఆవిరి అయిపోయింది.దీనిని ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంతో విషయం విపరీతంగా వైరల్ అయింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రైలు ప్రయాణికులకు ఓ విషయం బాగా తెలుసు.

ముఖ్యంగా అందులో అమ్మే టీ, సమోసాలు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో రుచి చూసి ఉంటారు.ప్రపంచంలో ఎక్కడా ఉండని, దరిద్రమైన టేస్ట్ రైల్వే టీకు ఉంటుందని ప్రయాణికులు తిట్టుకుంటుంటారు.

అయితే టీ మీద మమకారంతో, ఇష్టంతో తప్పని పరిస్థితుల్లో తాగుతుంటారు.తాజాగా లక్నో వెళ్తున్న అజి కుమార్ అనే ప్రయాణికుడు రైలులో సమోసా కొనుగోలు చేశాడు.

సగం తిన్న తర్వాత అందులో పసుపు రంగు కాగితం దర్శనమిచ్చింది.రైలు ప్రయాణంలో తిన్న సమోసా చిత్రాన్ని ట్వీట్ చేశాడు.

సమోసా లోపల పసుపు కాగితం ఉందని అతను పేర్కొన్నాడు.తాను తినడానికి ఒక సమోసా కొన్నానని, అందులో కొంత భాగం తిన్నానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.

అయితే అందులో పసుపు కాగితం కనపడిందని చెప్పాడు.

అది ఒక రకమైన రేపర్ లాగా కనిపించగా, అజి కుమార్ దానిని పసుపు కాగితం అని పేర్కొన్నాడు.“ప్రయాణికులకు అందిస్తున్న ఆహార పదార్థాల కోసం IRCTCకి సెల్యూట్ చేస్తున్నాను” అని అతను చెప్పాడు.దీనిపై ఐఆర్‌సీటీసీ స్పందించింది.

“సార్, అసౌకర్యానికి చింతిస్తున్నాము.దయచేసి DMలో పీఎన్ఆర్ నంబరు, మొబైల్ నంబర్‌ను షేర్ చేయండి.

అని ట్వీట్ చేసింది.ఇక ఐఆర్‌సీటీసీ తీరుపై నెట్టింట సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube