Cheating Girlfriend : వీడియో: ప్రియురాలిని మోసం చేద్దామనుకున్నాడు.. చివరికి అతడే మోసపోయాడు..

వైరల్ అవుతున్న వీడియోలో ప్రేమికులు ఒక ట్రైన్ సీట్లో కూర్చోవడం మనం చూడవచ్చు.కొంతసేపటికి ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రియురాలి పక్కన కూర్చుంది.

 He Wanted To Cheat On His Girlfriend But He Himself Was Cheated Video Viral-TeluguStop.com

ఆ అమ్మాయిని చూడగానే సదరు ప్రియుడి ముఖం వెలిగిపోయింది.ట్రైన్ సీట్ కిటికీ పక్కన ఈ అబ్బాయి కూర్చుంటే మధ్యలో అతడి లవర్, సీటు చివరన మరొక అమ్మాయి కూర్చుంది.

ఇతడు తన ప్రియురాలు( Girlfriend ) షూ లేస్ కట్టుకోవడానికి కిందకి వంగగానే ఆ అమ్మాయి వైపు చూసి చొంగ కార్చుకున్నట్లు ప్రవర్తించాడు.అది గమనించిన సదరు అజ్ఞాత అమ్మాయి కాల్ చేస్తా ఫోన్ నెంబర్( Phone Number ) ఫీడ్ చేసుకో అన్నట్లు సైగ చేసింది.

దాంతో సంబరపడిపోయిన ప్రియుడు వెంటనే తన ఫోన్ చేయి నెంబర్ సేవ్ చేసి ఇవ్వాలన్నట్లు సైగ చేశాడు.

అయితే అమ్మాయి అలా చేయలేదు.ఆ ఫోన్ హాయిగా తీసుకొని ట్రైన్( Train ) దిగి వెళ్లిపోయింది.అది చూస్తూ నిస్సహాయక స్థితిలో ఉండిపోవడం తప్ప ప్రేమికుడు ఏం చేయలేకపోయాడు.

ఒకవేళ అమ్మాయి వెంటపడినా లవర్( Lover ) మోసం చేస్తున్నాడనే విషయం ప్రియురాలికి తెలిసిపోతుంది.అంత సీన్ క్రియేట్ చేయడం ఎందుకని సదరు ప్రియుడు కామ్ గా ఉండిపోయాడు.

మొత్తానికి ప్రేమికురాలని మోసం చేయాలని భావించి చివరికి ఇతడే మోసపోయాడు.ఈ వీడియో ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగి ఉండొచ్చు కానీ ఇందులో నీతి మాత్రం అదిరిపోయింది అంటూ చాలామంది గర్ల్స్ కామెంట్ పెడుతున్నారు.

@Enezator ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు మూడు కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి.చాలామంది ఆమె తెలివైన దొంగ అని పొగిడారు.మరి కొంతమంది అతడు ఫోన్ ఇచ్చి తెలివి తక్కువ పని చేశాడు అని కామెంట్లు చేశారు.దీనిని ఒక ఫారినర్ షేర్ చేశాడు కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం తెలుగు సాంగ్ వినిపించింది.

ఆ సాంగ్ గుంటూరు కారం లోనిది.దీనిని మూడు కోట్ల మంది చూశారు కాబట్టి “గుంటూరు కారం” మ్యూజిక్ ఏ రేంజ్ లో రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube