ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టాడు.. చివరికి ఏమైందంటే

ఇటీవల కాలంలో చాలా మంది యువతకు సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది.ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు.

 He Risked His Life For Instagram Reels What Happened In The End , Instagram,ree-TeluguStop.com

సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు.సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు.

కష్టపడి చేసిన వీడియోకు అనుకున్న స్థాయిలో లైకులు, వ్యూస్ రాకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది.ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసకుంటున్నారు.

అయితే కొందరు మాత్రం చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది.

ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా గగుర్పాటుకు గురయ్యారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఏ వీడియో వెరైటీగా చేసినా, దానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన ఉంటోంది.అలాంటి సందర్భాల్లో కొందరు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీడియోలు చేస్తున్నారు.

ఎక్కువ లైకులు, వ్యూస్ రావాలని ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు.తాజాగా ఢిల్లీ నుంచి మాల్వా వెళ్లే ట్రైన్‌లో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వీడియో చేయాలని భావించాడు.

బాగా వేగంగా వెళ్లే ట్రైన్‌కు వేలాడుతూ ఇన్‌స్టా వీడియో తీసుకోసాగాడు.అయితే అకస్మాత్తుగా మధ్యలో ఓ స్తంభమో, సిగ్నల్ లైటో అడ్డుగా వచ్చింది.

ట్రైన్ వెళ్లే వేగానికి అతడు వేలాడుతూ ఉండడంతో దానిని ఢీకొట్టాడు.దీంతో అందరూ చూస్తుండగానే పడిపోయాడు.

త్రుటిలోనే ప్రాణాలు కోల్పోయాడు.దీనిని వీడియో తీస్తున్న వారు, ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వారు చూస్తూ ఉండడం తప్పా ఏం చేయలేని పరిస్థితి.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా నెటిజన్లు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియా కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదని చాలా మంది హితవు పలుకుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube