బస్సులో పొగలు రావడంతో కిటికిలో నుంచి దూకేశారు.. చివరికి?

బస్సు ప్రయాణం ఎంతో సురక్షితమని చాలామంది దూర ప్రయాణాలను చేస్తూ ఉంటారు.అయితే బస్సు ప్రయాణం కూడా కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతోంది.

ఇదివరకే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది కృష్ణాజిల్లా, విజయవాడ రూరల్ మండలం, ప్రసాదం పాడు వద్ద జాతీయ రహదారిపై ఎస్‌వీకేడీటీ (SVKDT ) ట్రావెల్స్ కు సంబంధించిన ఓ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి విజయవాడ కు వస్తున్న బస్సు ప్రసాదంపాడు లోని ఎస్విఆర్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా పెద్దశబ్దంతో టైర్ పగలడం తో ఇంజన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఏం జరిగిందోనని తీవ్ర ఆందోళన చెంది ఒక్కసారిగా బస్సు కిటికిలో నుంచి దూకేశారు.

అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, సురక్షితంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు భావించారు.డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా మరోవైపు గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ బస్సు బయట ఒక మినీ వ్యాన్ ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే మినీ వ్యాన్ లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో డ్రైవర్ ఒక్కరికే గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు