తెలుగులో నంబర్ వన్ హీరో ఇతనే.. సర్వే ఫలితాలతో అందరూ షాకయ్యేలా?

ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా సర్వే నిర్వహించి ఆ సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే.

ఈ సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జులై 2022 తెలుగుకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేసింది.

ఈ సర్వే ఫలితాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలి స్థానంలో ఉన్నారు.ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ఎన్టీఆర్ ఆస్కార్ కు నామినేట్ కావచ్చని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో జులై నెల ఫలితాలలో తారక్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సైతం ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఉన్నారు.

వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.

Advertisement
He Is The Number One Hero In Telugu Heroes List Details Here Goes Viral , Numbe

పుష్ప ది రైజ్ సక్సెస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో ఆ సినిమాకు మించి సంచలనాలను సృష్టిస్తారని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు.మరో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

చరణ్ కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ప్రిన్స్ మహేష్ బాబు ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారనే సంగతి తెలిసిందే.

He Is The Number One Hero In Telugu Heroes List Details Here Goes Viral , Numbe

న్యాచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడో స్థానంలో ఉన్నారు.విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో ఉండగా చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో రవితేజ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు