వాట్సాప్​లో కొత్త ఫీచర్ గమనించారా? రెండు రోజులైతే డిలీట్​!

ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ ఏమిటో అని ప్రత్యేకించి అడగాల్సిన పనిలేదు.

ఇక్కడ ఏ చిన్న పిల్లాడినైనా అడిగినా చెప్పేస్తాడు అది వాట్సాప్‌ అని.

ప్రతి నిత్యం కోట్లాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే చాటింగ్ చేస్తూ వుంటారు.దీనిద్వారానే అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను షేర్​ చేసుకుంటారు.

ఒకప్పటిలాగా ఇపుడు ఎవరు కూడా ఇమెయిల్స్ మీద ఆధారపడటం లేదు.అయితే మనలో అనేకమంది ఒక తప్పు చేస్తూ వుంటారు.

చాటింగ్​​ చేస్తున్న సమయంలో ఓ మెసేజ్​.ఒకరికి పంపబోయి మరొకరికి పంపించేస్తూ వుంటారు.

Advertisement

ఆ తరువాత ఏ గంటకో రెండు గంటలకు గాని చేసుకోరు.ఆనక అయ్యో అని అనుకుంటూ వుంటారు.

అయితే ఇలాంటి పొరపాట్లు చేసేవారికోసమే వాట్సాప్​ త్వరలోనే కొత్త ఫీచర్​ను తీసుకొస్తుంది.మెసేజ్​ చేసి రెండు రోజులు అయినా డిలీట్​ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

వాట్సాప్​ చాట్​లో డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్​ ఫీచర్​ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది.మొదట.

ఆ ఫీచర్​ను 8 నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది.ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్​ చేసే అవకాశాన్నిచ్చింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

ఇప్పుడు ఈ ఫీచర్​ను​ ఇంకాస్త సమయానికి పెంచుదామని వాట్సాప్​ అనుకుంటోంది.

Advertisement

ఈ కొత్త ఫీచర్​ వచ్చాక వాట్సాప్​లో పంపిన మెసేజ్​ను 56 గంటల తర్వాత కూడా డిలీట్​ చేసుకోవచ్చు.అంటే రెండున్నర రోజులైనా పర్వాలేదన్నమాట.ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ మోడ్​లో ఉంది.మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది.

దీంతో పాటు మరో ఫీచర్​ను ​కూడా వాట్సాప్​ తీసుకురానుంది.మీరు అడ్మిన్​గా ఉన్న గ్రూప్​​లోని ఏ మెసేజ్​నైనా డిలీట్​ చేసే అవకాశాన్ని కల్పించనుంది.