ఈ వింత రోడ్డు గురించి విన్నారా? అది రోజుకు 2 గంటలే కనిపిస్తుందట?

అవును, మీరు విన్నది నిజమే.నేటి టెక్నాలజీ యుగంలో( technology ) ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రభుత్వాలు హైటెక్‌ రోడ్లను నిర్మించే పనిలో ఉంటే, మనదగ్గర ఈ రోజుకీ కొన్ని రోడ్లు ఈసురోమంటూ చాలా దయనీయ పరిస్థితిలో వున్నాయి.

 Have You Heard Of This Strange Road It Only Appears 2 Hours A Day, Road, Visable-TeluguStop.com

మరీ ముఖ్యంగా దేశంలో కొండ ప్రాంతాలోని రోడ్లు చాలా భయానకంగా ఉంటాయి.అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది.

అది రోజులో కేవలం 2 గంటలు మాత్రమే కనిపిస్తుంది.మిగిలిన సమయంలో అదృశ్యం అవుతుంది.

వినడానికి విడ్డురంగా వున్నా ఇది నిజమే.

Telugu Hours, France, Islandnoir, Road, Latest, Visable-Latest News - Telugu

ఇక ఈ రోడ్డు ఫ్రాన్స్‌లో( France ) ఉంది.ఈ రోడ్డు ‍ప్రధాన భూభాగం నోయిర్‌ మౌటియర్‌ ద్వీపంతో( island of Noir Moutier ) కలుపుతుంది.ఫ్రాన్స్‌లోని అట్లాంటిక్‌ వద్ద వున్న ఈ రోడ్డు 4.5 కిలోమీటర్ల పొడవుని కలిగి వుంది.ఈ రోడ్డును ‘పాసేజ్‌ డూ గోయిస్‌’ పేరుతో పిలుస్తున్నారు.

ఫ్రెంచ్‌ భాషలో ‘గోయిస్‌’( Gois ) అంటే ‘చెప్పులు విడిచి రోడ్డు దాటడం’ అని అర్థం.ఇది రోజులో ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుందని సమాచారం.

మిగిలిన సమయంలో ఈ రోడ్డు నీటిలో మునిగిపోతుంది.ఆ సమయంలో రోడ్డుకు నలువైపులా నీరే కనబడడం కొసమెరుపు.

Telugu Hours, France, Islandnoir, Road, Latest, Visable-Latest News - Telugu

కాగా ఈ రోడ్డు దాటడం ఎంతో ప్రమాదకరం.రోజులో 2 గంటలు మాత్రమే ఎంతో పరిశుభ్రంగా కనిపించి, ఆ తరువాత మాయమైపోతుంది.అక్కడి నీటి లోతు 1.3 మీటర్ల నుంచి 4 మీటర్ల వరకూ ఏర్పడుతుంది.ఈ రోడ్డు మీదుగా ప్రయాణించే చాలామంది ప్రతీయేటా మృత్యువాత పడుతుంటారని వినికిడి.మొదట్లో జనం ఈ ప్రాంతానికి బోట్లలో వచ్చేవారు.తరువాత ఇక్కడ రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు.1840లో గుర్రాల సాయంతో జనం ఇక్కడికి వచ్చేవారని ప్రతీతి.1986 తరువాత ఇక్కడ ప్రత్యేకమైన్‌ రేసులు నిర్వహిస్తూ వస్తున్నారు.1999 నుంచి ఫ్రాన్స్‌ ఈ రోడ్డుపై ‘టూర్‌ ది ఫ్రాన్స్‌’ పేరిట సైకిల్‌ రేసులు నిర్వహిస్తూ వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube