సినిమాలకి హీరోల రెమ్యునరేషన్స్ పెద్ద ప్రాబ్లం గా మారయా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో చాలా మంది హీరోయిన్లు బిజీ గా ఉంటూ విపరీతమైన రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు అంటూ చాలా మంది ప్రొడ్యూసర్స్ కామెంట్లు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

నిజానికి ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్స్ కానీ డైరెక్టర్లది కానీ హీరోయిన్స్ ది కానీ అందరి రెమ్యునరేషన్లు( Remunerations ) విపరీతంగా పెరిగిపోయాయి.

ఎందుకంటే మన సినిమా ఇండియన్ సినిమా అయిపొయింది కాబట్టి మన సినిమా కి ఇండియా వైజ్ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీళ్లు కూడా రెమ్యునరేషన్స్ భారీగా పెంచారు.ఇక ప్రస్తుతం టాప్ హీరోయిన్లు అయినా శ్రీలీల( Sreeleela ), పూజా హెగ్డే, రష్మిక మంద, లాంటి వాళ్ళు ఒక సినిమా కోసం దాదాపు గా ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు అంటే నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ చాలా టాప్ లో ఉందనే చెప్పాలి.

ఇక వీళ్లు సినిమాల్లో కనిపించేది తక్కువ టైమే అయిన కూడా కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకోవడం చాలా దారుణం అని చాలా మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ భాదని చెప్తున్నారు అయితే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ప్రొడ్యూసర్( Producer ) కూడా ఒక సినిమా సక్సెస్ అయితే చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు లేకపోతె భారీ గా నష్టపోతున్నాడు.ఇక హీరోయిన్స్ అనే కాకుండా హీరోలు కూడా అంతలా రెమ్యునరేషన్స్ కాకుండా కొంచం తగ్గించి తీసుకుంటే మంచిది అని మరికొంత మంది అంటున్నారు.

ప్రతి సినిమా హిట్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కానీ ప్లాప్ అయితేనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని మరికొందరు అంటున్నారు.ఇక హీరోల రెమ్యునరేషన్స్ కూడా వందల కోట్ల లో ఉంటున్నాయి.అందుకే ప్రతి హీరో కూడా వాళ్ళ రెమ్యునరేషన్ సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటే మంచిది అని సినీ మేధావులు చెప్తున్నారు.

Advertisement
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

తాజా వార్తలు