జగన్ కు తత్వం బోధపడిందా?

ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసిన బిజెపి( BJP Govt ) వైఖరికి వైసిపి ప్రభుత్వం( YCP Govt ) ఆత్మ రక్షణలో పడిందా? ఇంతకాలం తన అవసరం ఉంది కాబట్టే మద్దతు ఇచ్చారు తప్ప తమ పై ప్రత్యేక అభిమానం ఏమి లేదన్న విషయాన్ని నిష్కర్షగా బయటపెట్టిన బిజెపి పెద్ద ల తీరు తో జగన్( AP CM Jagan ) కు తత్వం బోదపడింది అని విశ్లేషణనలు వస్తున్నాయి .అవసరం తీరిపోయాక కొత్త పొత్తుల కోసం చూస్తున్న బాజపా వైఖరి రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయన్న విషయాన్ని జగన్ కి అర్థమయ్యేలా చేసింది అని చెప్పాలి .

పల్నాడు జిల్లా క్రోసూరు లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనకు తత్వం బోధపడినట్లుగానే అర్థమవుతుంది .తనకి ఇక బిజెపి అండ ఉండకపోవచ్చు అని మీడియా అండ కానీ దత్తపుత్రుడు అండగాన్ని తనకు లేదని నేను వారిని చూసి రాజకీయాల్లోకి రాలేదని తన బలం తన బలగం ప్రజలు మాత్రమేనని .పేద ప్రజలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో తనకు అండగా ఉండాలంటూ ఆయన కోరారు జరుగుతున్న ప్రచారాన్ని కాకుండా జరిగిన మంచిని దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డకు అండగా నిలవాలంటూ ఆయన ప్రజలను కోరారు .ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ తమ ఎంపీల మద్దతు ఇచ్చినా కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా గొంతు మార్చిన బిజెపి వైఖరి ఆయనకు రాజకీయ వ్యవహారాలు ఎలా ఉంటాయో ఒక అవగాహనకు వచ్చినట్లే తెలుస్తుంది.

తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కూడా బాజాపా పెద్దల అండ తనకే ఉంటుందని భావించిన జగన్ బిజెపి అగ్ర నేతలవ్యవహార శైలి తో కొంత అయోమయం లో పడినట్లుగానే తెలుస్తుంది.ఒక రకంగా ఇది వైసీపీకి మంచి అవకాశం అనే చెప్పాలి .బిజెపి కి దేశ వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్న ప్రస్తుత పరిస్థితులలో దానితో స్నేహ కన్నా దూరం గా ఉండడమే మంచిది ఆంధ్ర ప్రజలకు బిజెపి మీద తీవ్ర స్థాయి కోపం కూడా ఉంది .ఇలాంటి అప్పుడు ఆ పార్టీతో కలిసి ఉండటం వల్ల జరిగే మంచికన్నా జరగబోయే నష్టమే ఎక్కువ ఉంది.అలాంటప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని పట్టుకుని కమల నాదులకి దూరం జరగడమే పార్టీకి మంచిది అన్న విశ్లేషణలు వస్తున్నాయి .

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...
Advertisement

తాజా వార్తలు