తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరీష్ శంకర్ (Harish Shankar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు.ఈ గ్లింప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు (Pawan Kalyan Fans) పండగ చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా ముచ్చటిస్తూ… అన్నా మొదటిసారి గిల్టీగా ఫీల్ అవుతున్నాను.సారీ అన్నా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.కేవలం ఒక్క గ్లింప్ తో మా అందరి నోర్లు మూయించావు.మా ఆనందం ఇప్పుడు మాటల్లో చెప్పలేను థాంక్యూ అన్నా, బ్లాక్ చేసిన ఫ్యాన్స్ ని అన్ బ్లాక్ చెయ్ అన్న ప్లీజ్ అని ట్వీట్ చేశారు.
ఇలా నేటిజన్ చేసిన ట్వీట్ కి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.మనలో మనకు గిల్టీ ఏంటి తమ్ముడు మనమంతా ఒక్కటే అంటూ రిప్లై ఇచ్చారు.అందరం కలిసి సినిమాను ఎంజాయ్ చేద్దాం అంటే చెప్పుకొచ్చారు.
ఇక బ్లాక్ చేసిన వారిని అన్ బ్లాక్ చేయమన్న విషయం గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ… తాను కేవలం బూతులు మాట్లాడే వారిని మాత్రమే బ్లాక్ చేసానని తెలిపారు.అయితే హరీష్ శంకర్ అభిమానులను ఇలా బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈయన పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా తేరి సినిమా రీమేక్ అని తెలియడంతో కొన్నాళ్ల క్రితం హరీష్ శంకర్ ను పవన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మీకు అలుసు ఇవ్వడం నాదే తప్పు అంటూ కొంతమందిని బ్లాక్ చేసిన విషయం మనకు తెలిసిందే.