హరీష్ రావు కి మంత్రి పదవి లేనట్టే...! ఎందుకంటే ...

టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా మాత్రమే కాకుండా.మామకి తగ్గ మేనల్లుడిగా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకెళ్తున్న హరీష్ రావు కి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి స్థానం ఉంది అనేది కొంతకాలంగా అందరికీ పెద్ద ప్రశ్నగా మారింది.

ఆయనకి రాష్ట్ర క్యాబినెట్ లో ఎటువంటి పోస్ట్ రాబోతోంది అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి.గత ఎన్నికల్లో రికార్డు మెజారిటీని సాధించారు.కేసీఆర్, కేటీఆర్ ల కన్నా అత్యధిక మెజారిటీని సాధించారు.

దీంతో ఆయన స్థాయికి తగిన పదవే దక్కబోతోంది అని అంతా అనుకుంటున్నా సమయంలో ఈ క్యాబినెట్ లో ఆయనకు పదవి దక్కే అవకాశం లేదు అనే సంచలన వార్త టీఆర్ఎస్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ విషయం ఏంటి అంటే.? కొంతకాలంగా.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టిపెట్టాడు.

దానిలో భాగంగా.ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసాడు.

అసలే తెలంగాణాలో గెలుపు హుషారులో ఉండడంతో.ఇక జాతీయ రాజకీయాల్లోనూ.

Advertisement

తిరుగులేని పట్టు సాధించేందుకు కసరత్తు చేస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే.

హరీష్ రావు ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.ప్రస్తుతం హరీశ్ రావు సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే కేసీఆర్ ప్లాన్ ఇక్కడ రెండు రకాలుగా కనిపిస్తోంది.తెలంగాణాలో కేటీఆర్ హవాకు హరీష్ రావు అడ్డురాకుండా.

ఈ విధంగా తప్పించే ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా.వ్యక్తం అవుతున్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమించడంతోనే హరీశ్ రావు ప్రాధాన్యత పార్టీలో సగం తగ్గిపోయిందనే వాదనలు మొదలయ్యాయి.

Advertisement

ఇక ప్రభుత్వ పగ్గాలను ఇప్పుడు కాకున్నా మరికొద్ది రోజుల్లో కేటీఆర్ కు అప్పగించాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చారని తెలుస్తోంది.రాష్ట్రంలో కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండాచేయాలన్న ఉద్దేశ్యంతో హరీశ్ ను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.దీనిలో భాగంగానే.

మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు.

తాజా వార్తలు