హుజురాబాద్ లో అడుగుపెట్టని హరీష్ ? అసలేం జరుగుతోంది ? 

టిఆర్ఎస్ లో కాస్త ప్రాధాన్యం తగ్గింది అనుకుంటున్న సమయంలో ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఇక్కడ బలమైన నేతగా ఉన్న రాజేందర్ ప్రభావం కనిపించకుండా చేసేందుకు, ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలు పండగల నాయకుడు, ఈటెల తో సన్నిహితంగా మెలుగుతారు అనే పేరున్న హరీష్ రావుకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు .

హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయం దక్కేలా చేసేందుకు, ఈటెల రాజేందర్ వైపు ఎవరు వెళ్ళకుండా చూసే బాధ్యతను హరీష్ రావుకు కెసిఆర్ అప్పగించారు.పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు తనకు ఏ బాధ్యతను అప్పగించినా, దానిని సమర్థవంతంగా నెరవేరుస్తారు.

ఇది అనేక సందర్బల్లో రుజువు కావడంతో హుజురాబాద్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు.అయితే ఆ బాధ్యతలను స్వీకరించిన హరీష్ ఈ నియోజకవర్గంలో పర్యటించకపోవడం అందరికీ ఆశ్చర్యంగానే కనిపిస్తోంది.

ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం అంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు పర్యటిస్తున్నారు.ముఖ్యంగా గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ వంటి వారే కాకుండా, నాయకులంతా ఈ నియోజకవర్గంలోనే పర్యటిస్తూ టిఆర్ఎస్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా అప్పుడే ఎన్నికల హడావుడి ఇక్కడ కనిపిస్తోంది.

కానీ హరీష్ రావు ఈ నియోజకవర్గంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు అనే చర్చ జరుగుతోంది.అయితే హరీష్ ఈ నియోజకవర్గంలో పర్యటించకపోయినా, ఆయన తెరవెనుక ఉండి మొత్తం కథంతా నడిపిస్తున్నారు.టిఆర్ఎస్ నుంచి ఎవరు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూస్తూ, ఈటెల చుట్టూ ఉన్న ఆయన అనుచరులు ఒక్కొక్కరిని టీఆర్ఎస్ వైపు తీసుకు వచ్చే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

ఎక్కువగా హైదరాబాద్ సిద్దిపేట నుంచే అన్ని వ్యవహారాలను హరీష్ పర్యవేక్షిస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం కు సంబంధించి కొంత మంది బీజేపీ నేతలు హైదరాబాద్ వచ్చి హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ విధంగా అన్ని పరిణామాలు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు హరీష్ పర్యవేక్షిస్తున్నారు.నియోజకవర్గంలో తాను పర్యటించినా, పర్యటించకపోయినా, పార్టీ ఇక్కడ గెలిచేలా మాత్రం చేయగలను అని నిరూపించేందుకు హరీష్ గట్టిగానే కష్టపడుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

హరీష్వ్యూహాలు, ఆలోచనలు కెసిఆర్ కు బాగా తెలుసు కాబట్టే ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటించినా పర్యటించక పోయినా కేసిఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదట.

Advertisement

తాజా వార్తలు