హరీష్ రావు వ్యాఖ్యలు బారాస వ్యూహంలో భాగమా?

ఆంధ్రప్రదేశ్ అధికారి పార్టీపై బారాస పార్టీ ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తుందా?జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

ఒకప్పుడు ప్రధాన మంత్రి అవ్వడానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ( Narendra Modi ) అనుసరించిన పాలసీని ఇప్పుడు గులాబీ దళం కూడా అనుసరించాలని చూస్తుందని ఒకప్పుడు మోడి ఎలా అయితే గుజరాత్ అబివృద్ది మోడల్ ను చూపించి దేశవ్యాప్త జనాభాను ఆకట్టుకున్నారో అదే విదం గా తెలంగాణను భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రోల్ మోడల్ గా బారసా చూపించాలనుకుంటుందని తన అభివృద్ధి నమూనాను చూపిస్తూ తమకు అవకాశం ఇస్తే దేశం మొత్తాన్ని కూడా ఇలాగే మారుస్తామంటూ ఒక సందేశం ఇవ్వడానికే ఈ మైండ్ గేమ్ మొదలుపెట్టిందని విశ్లేషణలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతో వచ్చిన బారాస ఉన్నటుండి ఇలా యూటర్న్ తీసుకోవడానికి భవిష్యత్తు వ్యూహాలే కారణమని వార్తలు వస్తున్నాయి.

రోడ్ల అభివృద్ధిలోనూ, మౌలిక సదుపాయాలు కల్పనలోనూ ఉద్యోగిత శాతంలోనూ తాము చాలా అభివృద్ధి చెందామని అందువల్ల పొరుగు రాష్ట్రాల ప్రజలు నిశ్చింతగా ఇక్కడ ఉండొచ్చని , ఓటు హక్కు కూడా ఇక్కడికి మార్చుకోవచ్చు అంటూ హరీష్ రావు( Harish Rao ) చేసిన వ్యాఖ్యల వెనుక అసల అర్దం ఇదే అని అందుకే ఆంధ్ర ప్రాంత మంత్రుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన వచ్చిన తర్వాత కూడా మంత్రి హరీష్ రావు అదే రకమైన వ్యాఖ్యలు మరొకసారి చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి .

తాను ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను తప్ప ఏపీ ని ఎక్కడా చులకన చేయలేదని పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) ఎందుకు పూర్తి అవ్వలేదని? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని ? ఇక్కడ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించానే తప్ప ఇందులో ఏపీని అవమానించే వ్యాఖ్యలు ఏమున్నాయి అంటూ తిరుగదాడి చేయడం గమనార్హం .

Advertisement

తెలంగాణ సర్వతోముఖంగా అభివృద్ధి చెందిందని ,ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి దొరుకుతయాని చెప్పడం ద్వారా మోడీ మార్క్ రాజకీయాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలని , తద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పొరుగు రాష్ట్రాలలో కూడా సీట్లను సాధించాలని బారాస చూస్తుందంటూ వార్తలు వస్తున్నాయి .

వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు