ఈ ఈక గోల ఏమిటని తేలిగ్గా తీసిపడేయొద్దు.విషయం తెలిస్తే మీరు అదిరిపడడం గ్యారంటీ.
ఈ విశాల భూ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మానవులకు కూడా అంతుచిక్కని జీవరాశులు ఎన్నో జీవిస్తున్నాయి.ఇక్కడ బతికే ప్రతి జీవికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
అయితే ఇపుడు పక్షులను తాకితేనే చనిపోయేంతటి ప్రమాదం ఉంటుందని మీరు ఎపుడైనా ఊహించారా? ఇలా ముట్టుకుంటే ప్రాణాపాయం కలిగించే పక్షులను గుర్తించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు.అవును, వాటిని ముట్టుకుంటే క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన 2 రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్ పరిశోధకులు గుర్తించగా అది కాస్త ఇపుడు పెద్ద చర్చ అవుతోంది.

ఆ 2 రకాల విషపూరిత పక్షులను రిజెంట్ విజ్లర్(పచీసెఫాలా స్లికగెల్లీ)( Regent Whistler ), రఫోస్–నేప్డ్ బెల్‌బర్డ్(అలిడ్రియాస్ రుఫినుచా)( Rufous-naped bellbird ) అనే పక్షి జాతులుగా గుర్తించారు.ఇవి ఎక్కువగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంటాయని వెల్లడించారు.పచ్చిసెఫలా ష్లెగెలి ( Pachycephala schlegeli )కాకిలా కూర్చుని ఉంటుంది.కానీ రంగు మాత్రం అనేక రంగులతో మిలితమై ఎంతో అందంగా ఉంటుందని చెబుతున్నారు.న్యూ గినియా అడవికి చెందిన ఈ పక్షులు తమ ఈకల్లో ప్రాణాంతకమైన విషాన్ని దాచుకుని జీవిస్తాయని కనుగొన్నారు.

ఇకపోతే, విషపూరితమైన ఆహారాన్ని తిన్న తర్వాత వేగంగా విషంగా మారడం వీటి ప్రత్యేకత.ఈ విషం తమ శరీరంలోనే ఉన్నా.ఈ పక్షులకు ఎలాంటి సమస్యలు కలగవని నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు చెబుతున్నారు.
విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే మనుషులకు చాలా సమస్యలు వస్తాయని చెప్పుకొస్తున్నారు.వాటి ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం, గుండె కొట్టుకోవడం ఆగిపోతుందట.
ఇంకేముంది కట్ చేస్తే క్షణాల వ్యవధిలోనే మనిషి మృత్యు ఒడిలోకి జారుకుంటాడు.ఈ పక్షులతో కొద్దిపాటి సంపర్కం కూడా మనుషుల ప్రాణాలను బలిగొంటుందని పరిశోధకులు వెల్లడించారు.







