పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో నింపుకున్నాడు.అయితే ఇటీవల మళ్ళీ రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈయన సినిమాలన్నీ ఆగిపోయాయి.
దీంతో ప్రజెంట్ పవన్ లేని పార్ట్ లను మేకర్స్ షూట్ చేసుకుంటున్నారు.ఇక పవన్ లైనప్ లో ప్రజెంట్ మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.
అన్నింటిపై ఫ్యాన్స్ కు మంచి హోప్స్ ఉన్నాయి.

మరి పవర్ స్టార్ లైనప్ లో ”హరిహర వీరమల్లు‘( Hari Hara Veera Mallu )’ ఒకటి.ఇటీవలే ప్రకటించిన కొత్త సినిమాల షూటింగులను చేస్తున్న పవన్ వీటి కంటే ముందే ప్రకటించిన ”హరిహర వీరమల్లు” సినిమాను మాత్రం పక్కన పెట్టారు.ఎందుకో తెలియదు కానీ ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.
ఇప్పటికే స్టార్ట్ చేసి రెండేళ్లకు పైగానే అవుతుంది.అయినా ఇంకా మొదలవడం లేదు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూట్ పూర్తి అయినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.కానీ షూట్ మాత్రం మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఈ సినిమామీ ఎం ఎం రత్నం నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రజెంట్ వీరమల్లు నుండి ఒక పిక్ వైరల్ అయ్యింది.ఆ పిక్ చూసి అంతా పవన్ అనే అనుకున్నారు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ పిక్ లోని కాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నాయి.
దీంతో కన్ఫ్యూజ్ అయ్యారు.నిజానికి ఈ పిక్ తమిళ్ లో వచ్చిన సూపర్ హిట్ ”వీరన్” లోనిది అని తెలుస్తుంది.
ఇది ఫ్యాన్స్ కు తెలిసేలోపే నెట్టింట వైరల్ అయ్యింది.







