ప్రస్తుత కాలంలో విదేశాలలో సినిమా షూటింగ్ చేయడం అనేది సాధారణ విషయం అనే సంగతి తెలిసిందే.కొన్ని సినిమాలకు అవసరం లేకపోయినా విదేశాలలో షూటింగ్ చేయడం వల్ల సినిమాలపై బడ్జెట్ భారం అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
అయితే 45 సంవత్సరాల క్రితం అమెరికాలో షూటింగ్ చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది.అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా హరే కృష్ణ హలో రాధ కావడం గమనార్హం.
ఈ సినిమాకు శ్రీధర్ డైరెక్టర్ కాగా భరణీరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరో కాగా శ్రీప్రియ హీరోయిన్ రోల్ లో నటించి మెప్పించారు.
డైరెక్టర్ శ్రీధర్ కృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆయనను తమిళ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని భావించారు.కాదలిక్క నేరమిల్లై సినిమాలో కృష్ణకు నటించే ఛాన్స్ దక్కగా కృష్ణ తమిళం నేర్చుకోవాలని ప్రయత్నించినా నేర్చుకోలేకపోయారు.
ఆ తర్వాత కృష్ణ ఆ సినిమాను వదులుకోవడంతో రవిచంద్రన్ ఆ సినిమాలో హీరోగా నటించగా సినిమా సక్సెస్ సాధించింది.ఈ సంఘటన జరిగిన 15 సంవత్సరాల తర్వాత కృష్ణ, శ్రీధర్ కాంబినేషన్ లో హరే కృష్ణ హలో రాధ సినిమా తెరకెక్కడం గమనార్హం.
అమెరికాలో ఈ సినిమా షూట్ జరిగిన సమయంలో విజయనిర్మల గారు షూటింగ్ లో పాల్గొన్న వాళ్లందరికీ ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

1980 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.క్రైమ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.కృష్ణ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో హరే కృష్ణ హలో రాధ వార్తల్లో ఒకటిగా నిలవడం గమనార్హం.
కృష్ణ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.







