హార్దిక్ పటేల్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.గుజరాతులో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు డిమాండ్ ఉద్యమం సాగిస్తున్న 22 ఏళ్ళ యువకుడు.
ఇప్పుడు అతను పేరుమోసిన నాయకుడు.తన ఉద్యమాన్ని మధ్యప్రదేశ్కు కూడా విస్తరిస్తానని చెబుతున్నాడు.
మధ్య ప్రదేశ్లోనూ పటేల్ సామాజిక వర్గం ఉంది.కాబట్టి అక్కడ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఈ ఉద్యమం ఒకటి రెండు రాష్ట్రాలతో ఆగేలా లేదు.ఇది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది.
అన్ని రాష్ట్రాల్లో పటేల్ సామాజిక వర్గం లేదు.కాబట్టి రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేస్తున్న సామాజిక వర్గాలకు మద్దతు ఇస్తామని హార్దిక్ ప్రకటించాడు.
ఏపీలో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న కాపు సామాజిక వర్గానికి మద్దతు ఇస్తామని ఇదివరకే ప్రకటించాడు.ఈ ఉద్యమం తొందరలోనే ఎపీకి కూడా విస్తరించే అవకాశం కనబడుతున్నది.
హార్దిక్ రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు.అది కూడా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది.
ఇక గుజరాత్ గొప్పగా అభివృద్ధి అయిందని జరుగుతున్న ప్రచారాన్ని హార్దిక్ ఒప్పుకోవడంలేదు.గుజరాత్ అభివృద్ధి డొల్ల అని నిరూపిస్తానని సవాల్ చేశాడు.
అలా నిరూపించ గలిగితే ప్రధాని నరేంద్ర మోడీ పరువు పోతుంది.మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ ను అభివృద్ధి చేసాడనే ప్రచారం వల్లనే ప్రధాని కుర్చీ ఎక్కగాలిగారు.
.






