మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.ఇలా అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున ఈయనకి అభిమానులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈయన నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2)సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా నుంచి ఈయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఇక ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసాయి.తాజాగా ఈ పోస్టర్ పై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) స్పందించారు.నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు పుట్టిన రోజు(Birthday) శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా పుష్ప 2 ఫస్ట్ లుక్ పోస్టర్ పై కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… హ్యాపీ బర్త్ డే డియర్ బన్నీ… పుష్ప 2ది రూల్ ఫస్ట్ లుక్ రాకింగ్(Rocking) గా ఉంది.ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది.అలాగే ఈయన ఫస్ట్ లుక్ రాకింగ్ గా ఉంది అంటూ కామెంట్ చేయడంతో బన్నీ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి సినిమా ద్వారా ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయం అయ్యారు.చిరంజీవి నటించిన విజేత(Vijetha) సినిమాలో బాలనటుడిగా సందడి చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత స్వాతిముత్యం డాడీ సినిమాలలో నటించి మెప్పించారు.
ఇక గంగోత్రి సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.







