తల్లీదండ్రులు పడిన కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరే పిల్లలు చాలా తక్కువమంది ఉంటారు.రేయింబవళ్లు కష్టపడితే మాత్రమే ప్రస్తుత కాలంలో ఉన్నత ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
హనుమవ్వ( Hanumavva ) ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే భర్త మరణించాడు.భర్త చనిపోయాడన్న బాధను దిగమింగుతూ పుట్టిన కొడుకును హనుమవ్వ చదివించారు.
బిడ్డను చదివించడానికి ఏ ఆదాయ మార్గం లేకపోవడంతో హనుమవ్వ వ్యవసాయంపై దృష్టి పెట్టారు.మూడెకరాలలో పంటను సాగు చేస్తూ కొడుకును చదివించారు.మధ్యలో వేర్వేరు సమస్యలు ఎదురవడంలో తనకు ఉన్న మూడెకరాల భూమిలో ఆమె ఎకరన్నర పొలాన్ని విక్రయించారు.పొలంలో పండించిన పంటను నిజామాబాద్ జిల్లా( Nizamabad ) గంజ్ కు వెళ్లి ఆమె సొంతంగా విక్రయించేవారు.

కొడుకు ఎస్సై అయినా హనుమవ్వ ఇప్పటీ వ్యవసాయం చేస్తున్నారు.కన్న కొడుకును ప్రయోజకుడిని చేసిన ఆనందం హనుమవ్వ కళ్లలో కనిపిస్తోంది.హనుమవ్వ కొడుకు రాజారెడ్డి( Rajareddy ) మొదట కానిస్టేబుల్ జాబ్ కు ఎంపికయ్యారు.ఆ తర్వాత ఎస్సై పరీక్షలు రాసి నవీపేట ఎస్సైగా జాబ్ కు( SI Job ) ఎంపికయ్యారు.
హనుమవ్వ తన కొడుకు సక్సెస్ గురించి మాట్లాడుతూ భర్త మరణంతో కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు.

ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కొడుకును ప్రయోజకుడిని చేయాలని భావించి ఆ దిశగా అడుగులు వేశానని ఆమె తెలిపారు.కొడుకు ఎస్సై కావడం సంతోషంగా ఉందని ఇప్పటికీ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నానని ఆమె అన్నారు.రాజారెడ్డి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన రాజారెడ్డి సక్సెస్ ను ఎంతగానో మెచ్చుకున్నారు.రాజారెడ్డి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
కష్టపడి కొడుకును ప్రయోజకుడిని చేసిన హనుమవ్వ సక్సెస్ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.








