ఆరోజు నుండే తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభం..

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ( Venkateswara swamy )వెలసిన తిరుమలగిరిలో నిత్యం ఆధ్యాత్మిక శోభ విరజల్లుతూ ఉంటుంది.

అక్కడ ఎల్లప్పుడూ ప్రత్యేక ఉత్సవాలు, వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.

అక్కడ కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు కాకుండా తిరుమలగిరిలో వెలసిన వివిధ దేవతలకు సంబంధించిన పండుగలను అలాగే వేడుకలను ఎంతో వైభవంగా జరుపుతారు.ఇటీవల శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా తిరుమలగిరిలో జరిగాయి.

ఇక ఇప్పుడు హనుమత్ జయంతి( Hanumath Jayanti ) వేడుకలకు కూడా తిరుమల సర్వం సిద్ధమవుతోంది.అయితే హనుమత్ జయంతి మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించబోతుంది.టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి( TTD EO AV Dharma Reddy ) ఈ విషయాన్ని తెలిపారు.

అలాగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్వీబీసీ, ఇంజనీరింగ్ శ్రీవారి ఆలయం, అన్న ప్రసాదం ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తారని ఈవో తెలిపారు.

Advertisement

అలాగే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం నాడు వివో చాంబర్ లో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.హనుమత్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.అయితే ఆకాశగంగా వద్ద ఐదు రోజులపాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు అలాగే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలోనూ పండితులకు ప్రసంగాలు ఏర్పాటు చేశారు.

ఇక తిరుమల వేద విజ్ఞాన పీఠంతో పాటు యాగం నిర్వహించేందుకు పండితులను కూడా ఆహ్వానించాలని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ అవధానినీ ఆదేశించారు.ఇక ధర్మగిరి తో పాటు ఎస్పీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృతవర్సిటీ ఎస్పీ, ఉన్నత వేద అధ్యాయాలలోని పేద పండితులు కూడా పాల్గొనాలని ఆయన కోరారు.ఆ తర్వాత ఆహ్వానితులకు రవాణా, వసతి, దర్శనం మిగతా సౌకర్యాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు