ఎంతో మంది భారతీయులు ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఎన్నో దేశాలు వెళ్లి అక్కడ స్థిరపడుతూ ఎన్నో రకాల పదవులు చేపడుతూ భారత దేశానికి ఎంతో మంచి పేరు తీసుకుని వస్తున్నారు ఈ తరుణంలో కొన్ని కొన్ని సంఘటనలు భారత్ పరువు తీస్తున్నాయి.తాజాగా జరిగిన సంఘటన ఇందుకు నిదర్సనంగా మారింది.
వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో స్థిరపడాలని వెళ్ళిన “కెవిన్ ప్రసాద్” అనే ప్రవాస భారతీయుడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీగా పని చేస్తున్నాడు.
అదేచోట ఓ యువతి సహా ఉద్యోగిగా పని చేస్తోంది.ఈమెను ఎలాగైనా లోబరుచుకోవాలని అనుకున్న అతడు పలుమార్లు ఆమెను డేటింగ్‌కు రమ్మని ఆహ్వానించాడు…అయితే ఆమె రానని ఎన్ని సార్లు చెప్పినా సరే ఆమెని నగలు, డబ్బు చూపించి లోబరుచుకోవాలని అనుకున్నాడు అయితే.
ఆమె ప్రతీ సారి అతన్ని తిరస్కరిస్తూ వచ్చేది.అంతేకాదు తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్.అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని ఎన్నో సార్లు చెప్పింది అయితే ఈ క్రమంలోనే ఒక సంఘటన జరిగింది ఒక రోజు ముసుగు ధరించిన వ్యక్తి వచ్చి ఆమె బాయ్ ఫ్రెండ్ మంగాక్కట్ ని కాల్చి చంపారు.అయితే విచారణ చేపట్టిన పోలీసులు ప్రసాద్ సహా ఉద్యోగిని విచారించగా.
తానూ పని చేసే చోటే ఒక యువకుడు పని చేసేవాడని అతడు తరచూ డేటింగ్ కి రమ్మని ఒత్తిడి చేసేవాడని తెలిపడంతో పోలీసులు ఆదిసగా విచారణ చేపట్టి ప్రసాద్ హంతకుడని తేల్చారు అయితే ఈ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.అయితే ఈ నేరం గనుకా ఋజువైతే అతడికి మరణ శిక్ష సైతం పడే అవకాశం ఉందని అంటున్నారు.