Hamsa Nandini Cancer : క్యాన్సర్ ను జయించిన హీరోయిన్ హంసానందిని.. మీరే కారణమంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హంసా నందిని గురించి ప్రత్యేకంగా గురించి అక్కర్లేదు.తెలుగులో పలు ఐటెం సాంగ్స్ లో చిందులు వేసి ఐటమ్ బాంబ్ గా కూడా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Hamsa Nandini Returns To Sets After Battle With Breast Cancer , Hamsa Nandini ,-TeluguStop.com

తెలుగులో హంసా నందిని మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది.ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

అయితే ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.ఈ ఏడాది ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.

క్యాన్సర్ బారిన పడిన ఆమె చాలా బాధను అనుభవినట్లు ఆమె తెలిపింది.

ఇక అప్పటి నుంచీ కాన్సర్ ట్రీట్మెంట్ ను తీసుకుంటూ చివరకు ఆ క్యాన్సర్ మహమ్మారి ని జయించింది.

క్యాన్సర్ మహమ్మారితో దైర్యంగా పోరాడి జయించిన ఆమె తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.అయితే ఆమెకు వంశపారంపర్యంగా ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది.2021 డిసెంబర్ లో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది హంసా నందిని.నైన్ సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో 7 సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు ఆమె వెల్లడించింది.

అయితే తాజాగా ఆమె తిరిగి ఓ సినిమా షూటింగ్ కు హాజరైయింది.అదే రోజు తన పుట్టిన రోజు కావడంతో షూటింగ్ సెట్ లో సందడి సందడి చేసింది.

అంతే కాకుండా తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్ డేట్ కూడా ఇచ్చింది నందిని.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.మూవీ సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది.కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు.ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను.మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.

నేను తిరిగి వచ్చేశా అని హంసా నందిని సంతోషంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.హంసానందిని తల్లి క్యాన్సర్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే.తాజాగా కూడా ఆమె అదే విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడింది.18 ఏళ్ళ క్రితమే తన తల్లిని క్యాన్సర్ మహమ్మారి పొట్టన పెట్టుకుంది అంటూ ఎమోషనల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube