ఈ ఏడాది ఇప్పటివరకు ఏ సినిమా హిట్టో, ఏ సినిమా ఫట్టో లిస్టు చూడండి

చూస్తుండగానే ఏడాదిలో సగభాగం గడిచిపోయింది.ఈ అర్థవార్షికంలో అత్యంత సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ గా నిలిచింది తెలుగు సినిమా.

ఓవైపు బాలివుడ్ కష్టాలను చూస్తోంటే, తెలుగు మార్కెట్ మాత్రం పెరిగిపోతుంది.ఈ ఏడాది టాప్ 10 ఓపెనింగ్స్ లో 5 తెలుగు సినిమాలే ఉన్నాయి.

బాహుబలి ది కంక్లుజన్, ఖైది నంబర్ 150 ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాప్ 2 ఓపెనింగ్స్ ఇండియాలో.ఇక కేవలం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అర్థవార్షికాంలో 8 హిట్ సినిమాలు వచ్చాయి.చూడండి మీరే ఏ సినిమా రిజల్ట్ ఏమిటో.

బ్లాక్ బస్టర్స్ :

బాహుబలి ది కంక్లుజన్ .షేర్ కలెక్షన్ల పరంగా భారతదేశ సినిచరిత్రలో అతిపెద్ద హిట్.గ్రాస్ పరంగా కేవలం దంగల్ వెనకాలే ఉంది.500 కోట్లకు పైగా లాభాలను పంపిణిదారులకి అందించిన బాహుబలి బ్లాక్ బస్టర్ కేటగిరిలోకి వస్తుంది.శతమానంభవతి.పెట్టిన దానికి రెండింతలు సంపాదించిన సినిమా.30 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు.కొన్నవారందరికి భారి లాభాలు.

ఇది కూడా బ్లాక్ బస్టర్.ఈ ఏడాది మూడోవ బ్లాక్ బస్టర్ నేను లోకల్.

Advertisement

మూడింట్లో రెండు దిల్ రాజువే కావడం విశేషం.ఇది కూడా 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

సూపర్ హిట్స్ :

27 కోట్లా షేర్ సాధించిన రారండోయ్ వేడుక చూడం సూపర్ హిట్ కేటాగిరిలో వస్తుంది.ఇది నాగచైతన్య కెరీర్ లో రెండోవ అతిపెద్ద గ్రాసర్.

ఘాజి, గురు చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి.లాభాల్ని తీసుకొచ్చాయి.ఇవి రెండు సూపర్ హిట్స్ లెక్కలోకి వస్తాయి.

హిట్స్ :

ఖైది నం 150 బాహుబలి సిరీస్ తరువాత అతిపెద్ద గ్రాసర్ అన్నట్లే కాని పంపినిదారుల చేతికి మరీ ఎక్కువేమి రాలేదు.పైగా నైజాం లాంటి ఏరియాలో నష్టాలు వచ్చాయి.89 కోట్లు పంపినిదారులు పెడితే, అందరికి కలిపి కేవలం 12-13 కోట్ల లాభం తీసుకొచ్చింది ఈ సినిమా.కాబట్టి ఇది కేవలం హిట్.

గౌతమీపుత్ర శాతకర్ణి బాలకృష్ణ కెరీర్ లో తోలి 50 కోట్ల సినిమా కావచ్చు.అయినా బ్లాక్ బస్టర్ కాదు.తృటిలో నష్టాలని తప్పించుకొని హిట్ గా నిలిచింది.

యావరేజ్ :

కిట్టు ఉన్నాడు జాగ్రత్త, కేశవ, ఆమి తుమి ఈ మూడు చిత్రాలు 80% నుంచి 90% రికవరిని రాబట్టాయి.ఇవి యావరేజ్ చిత్రాలు.

ఇక మిగితా చిత్రాల గురించి మాట్లాడుకుంటే, నిన్ను కోరి రిపోర్ట్స్ ప్రకారం సక్సెస్ ఫుల్ చిత్రం అయ్యేలా ఉంది.మిస్టర్ భారి డిజాస్టర్ గా నిలిచింది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

దువ్వాడ జగన్నాథం ఫ్లాప్ నుంచి యావరేజ్ గా నిలుస్తుంది.కాటమరాయుడు ఫ్లాప్ గా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు