ఈ హెయిర్ క్రీం ను వాడితే వింటర్లో పొడిబారిన జుట్టు స్మూత్ అండ్ సూపర్ సిల్కీగా మారుతుంది!

ప్రస్తుత వింటర్ సీజన్ లో చర్మం మాత్రమే కాదు జుట్టు సైతం డ్రైగా మారుతుంటుంది.

జుట్టు డ్రై గా మారడం వల్ల నిర్జీవంగా మరియు చూపరుల‌కు అందవిహీనంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలోనే పొడిబారిన జుట్టును సిల్కీ అండ్ స్మూత్ గా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ హెయిర్ క్రీం ను కనుక వాడితే జుట్టు ఎంత డ్రై గా ఉన్నా సరే ఒక్క దెబ్బతో స్మూత్ అండ్ సూపర్ సిల్కీ గా మారుతుంది.

మరి ఇంతకీ ఆ హెయిర్ క్రీం ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షియా బటర్ ను వేసుకోవాలి.

అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని స్పూన్ తో ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మ‌న హెయిర్ క్రీం సిద్ధమవుతుంది.

Advertisement

ఈ హెయిర్ క్రీం జుట్టు కుదుళ్ల‌ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.కనీసం రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే పొడి జుట్టు స్మూత్ గా మరియు సిల్కీ గా మారుతుంది.

హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడంలోనూ ఈ క్రీం సహాయపడుతుంది.వారంలో ఒక్కసారి ఈ క్రీమ్ ను అప్లై చేసుకుంటే జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్‌గా మారతాయి.

దాంతో జుట్టు రాలడం క్రమంగా అదుపులోకి వస్తుంది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు