అసలు వాస్తవం ఇదే : హెచ్1బీ వీసాదారుల శ్రమ దోపిడి.. అత్యల్ప వేతనాలిస్తున్న కంపెనీలు

భారతీయులకు అమెరికా ఉద్యోగంపై ఉన్న మోజు అంతా ఇంతా కాదు.

అమెరికాలో ఓ చిన్న ఉద్యోగం వస్తే చాలు జీవితం సెటిల్ అవుతుందనే వారు మనదేశంలో లక్షల్లో ఉన్నారు.

ఎన్నో కష్టనష్టాలకు ఒర్చుకుని యువత అగ్రరాజ్యంలో కొలువులు సంపాదించడంతో పాటు భారతదేశానికి కూడా గర్వకారణంగా నిలుస్తున్నారు.అయితే ఈ డాలర్ డ్రీమ్‌లో కొత్త కోణాన్ని బయటపెట్టింది ఎకనమిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక.‘‘హెచ్1బీ వీసాస్ అండ్ ప్రివెయిలింగ్ వేజ్ లెవెల్స్’’ పేరిట ఈ సంస్ధ నిర్వహించిన సర్వేలో అమెరికాలోని అత్యథిక కంపెనీలు హెచ్1బీ వీసాదారులకు సాధారణ వేతనాలతో పోలిస్తే తక్కువ చెల్లిస్తున్నట్లు తేలింది.చిన్నాచితకా కంపెనీలతో పాటు ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం తక్కువ వేతనాలను చెల్లిస్తున్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు.హెచ్1 వీసా దారుల్లో 60 శాతం మంది అక్కడి లోకల్ మీడియన్ వేజ్ కంటే తక్కువగా పొందుతున్నారని నివేదిక ప్రస్తావించింది.దిగ్గజ కంపెనీలు సైతం మీడియన్ వేజ్ కంటే తక్కువ ఉండే లెవల్ 1, లెవల్ 2 వేతనాలే ఇస్తున్నాయని తెలిపింది.డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ హెచ్ 1బీ నిబంధనలు సైతం దీనికి అనుమతిస్తున్నాయని ఎకనమిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ స్పష్టం చేసింది.హెచ్1బీ వీసాదారులకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే తొలి 30 కంపెనీల్లో సగానికిపైగా ఉద్యోగుల ఎంపికలో ఔట్‌ సోర్సింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయని పేర్కొంది.కానీ టెక్ కంపెనీలు మాత్రం ఉద్యోగులను నేరుగా రిక్రూట్ చేసుకునేందుకే మొగ్గుచూపుతున్నాయని నివేదిక తెలిపింది.

అయితే వేతనాల్లో మాత్రం లెవల్ 1, లెవల్ 2 విధానాన్నే అలంభిస్తున్నాయి.

మరోవైపు అమెరికాలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.వీరిలో హెచ్1బీ వీసాదారుల సంఖ్య ఎక్కువే.అమెరికాతో పాటు వారి సొంతదేశాలు సైతం లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారు దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు.

Advertisement

కరోనా సంక్షోభం కారణంగా వీసా, గ్రీన్‌కార్డు దారులకు ఉపశమనం కలిగించేందుకు గాను అవసరమైన పత్రాలను సమర్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం 60 గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు