ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిషేధిత గంజాయి కలకలం చెలరేగింది.గంజాయి క్రయ విక్రయాలు జోరుగా సాగుతుండటంతో పలువురు విద్యార్థులు బానిసలుగా మారుతున్నారని సమాచారం.
విసన్నపేటలో స్టూడెంట్స్ టార్గెట్ గా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలో కాలేజీలు, స్కూల్స్ వద్ద విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
దీంతో గంజాయి సేవించి విద్యార్థులు వాహనాలు నడుపుతోన్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ క్రమంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.







