అమెరికాలో తెలుగు ఎన్నారైల వనభోజనాలు ..

తెలుగు వారు ఎక్కడ ఉన్నా మన తెలుగు సాంప్రదాయాలు మాత్రం మర్చిపోరు.సొంత ఊరిలో గతాలని గుర్తు చేసుకుంటూ తాము ఉన్న చోటనే తెలుగు పండుగలని, ఆచారాల్ని,సంస్కృతిని ఆచరిస్తూ ఉంటారు.

 Guntur Nri Form Conducts Karthika Vanabhojanalu In Amerika-TeluguStop.com

అందులో భాగంగానే గుంటూరు కి చెందిన ఎన్నారైలు అందరూ ఏకమై డల్లాస్ లో కార్తీక వనసమారాధన ఏర్పాట్లు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు…వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తున్న గుంటూరు ఎన్నారైలు నవంబర్ 17 శనివారం ఫ్రిస్కోలో ఉన్న ‘ఫ్రిస్కో కామన్స్ పార్క్’లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వనభోజనాలని నిర్వహించనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 500 మంది రిజిస్టర్ చేసుకున్నారని, దీనిలో 200 మంది పిల్లలు 300 మంది పెద్దలు ఉన్నారని కొమ్మినేని శ్రీనివాస్ తెలిపారు…అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు.తప్పకుండా
ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని.పిల్లల కోసం ప్రత్యేకంగా డాన్స్ పోటీలు, పెయింటింగ్.మొదలగు తెలుగుదనం ఉట్టిపడే కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు….అలాగే మహిళల కోసం ముగ్గుల పోటీలు, కవితల పోటీలు, వంటలు మరియు ఆటల పోటీలు ఉంటాయన్నారు…అక్కడికి వచ్చిన అతిధులు అందరికి గుంటూరు సాంప్రదాయ వంటకాలు వడ్డిస్తామన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube