సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”( Gunturu karam movie ).ఈ సినిమా నుండి మొన్న మాస్ స్ట్రైక్ అంటూ వీడియో రిలీజ్ చేసారు.
ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు.మంచి మాస్ మసాలా సినిమాగా త్రివిక్రమ్ దీనిని తెరకెక్కిస్తున్నాడు.
ఈ అవైటెడ్ కాంబో నుండి వచ్చిన ఈ గ్లింప్స్ సహా టైటిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
మహేష్ ఫ్యాన్స్ చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ మహేష్ ను చూసాం అని చెబుతున్నారు.సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మహేష్ గుంటూరు కారం గురించే టాక్ నడుస్తుంది.
ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా రిలీజ్ చేసారు.ఈ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును నెలకొల్పింది అని అంటున్నారు.ఈ మాస్ స్ట్రైక్ 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్( All Time Record ) క్రియేట్ చేసి యూట్యూబ్ లో కూడా ఇంకా నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తుంది.మొత్తానికి ఈసారి త్రివిక్రమ్ మహేష్ తో ప్లాన్ చేసిన మాస్ స్ట్రైక్ చూస్తుంటే సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ట్ లెవల్లో రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.
ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.