''గుంటూరు కారం'' సెకండ్ సింగిల్ అప్డేట్ ఇదే.. నాగవంశీ ఏం చెప్పాడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం( Guntur Karam ).

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నారు.

వచ్చే నెల సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Guntur Kaaram Movie Second Single Update, Guntur Kaaram, Mahesh Babu, Triv

ఈ క్రమంలోనే మిగిలిన షూట్ మొత్తం ఈ నెలలోనే ఫినిష్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అతి త్వరలోనే మహేష్, శ్రీలీలపై మూడవ సాంగ్ ను కేరళలో షూట్ చేయనున్నారని టాక్.ప్రస్తుతం ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమా సెకండ్ సింగిల్ గురించి అప్డేట్ తెలుస్తుంది.

ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ గా నిలువగా సెకండ్ సింగిల్ కోసం అంత ఎదురు చూస్తున్నారు.

Guntur Kaaram Movie Second Single Update, Guntur Kaaram, Mahesh Babu, Triv
Advertisement
Guntur Kaaram Movie Second Single Update, Guntur Kaaram, Mahesh Babu, Triv

ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ సెకండ్ సింగిల్ ( Guntur Kaaram Second Single) పై అప్డేట్ ఇచ్చారు.నితిన్ ( Nithiin ) ఈ సెకండ్ సాంగ్ అప్డేట్ ను ట్విట్టర్ వేదికగా అడుగగా రెండు రోజుల్లో అప్డేట్ ఇస్తామని నాగవంశీ ( Suryadevara Naga Vamsi ) తెలిపారు.మరి చెప్పినట్టుగానే రేపు ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో అఫిషియల్ గా చెప్పబోతున్నట్టు టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు