గుండ్లగూడెం రైల్వే గేటు వల్ల నాలుగు గ్రామాలకు నరకయాతన...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సికింద్రాబాద్-కాజీపేట రైల్యే మార్గం మధ్య ఆలేరు పట్టణంలోని గుండ్లగూడెం ర్తెల్వేగేటు వల్ల ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, శివలాల్ తాండా,పటేల్ గూడెం,శ్రీనివాస్ పురం గ్రామాలకు చెందిన సుమారు 7 వేల మంది ప్రజలు రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.ఈనాలుగు గ్రామాల ప్రజలుప్రత్యామ్నాయ మార్గం లేక ఆలేరు పెద్ద వాగులో నుండి సమాధులు, బురద నీళ్లులో నుండి ఇసుకలో ఇరుకుంటూ చెత్త చెదారంతో కంపు కొడుతున్నా ముక్కుమూసుకొని,అన్నివర్గాల వారు,విద్యార్దులు నరకయాతన‌ పడుతూ రాకపోకలు కొనసాగిస్తున్నారు.

 Gundlagudem Railway Gate Caused Hell To Four Villages , Gundlagudem, Railway Gat-TeluguStop.com

పిల్లలు పాఠశాలకు,ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఈ గేటు దాటాస్సిందే.ప్రతి నిత్యం సుమారు 250 ట్రెన్స్,గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో వస్తూ పోతూ ఉంటాయి.

అందువల్ల ప్రతి ఐదు,పది నిమిషాలకు గేటు పడుతుంది.దీనితో స్కూల్ కు పోయే విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ టైంకు వెళ్లలేక పోవడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లేవారికి కూడా ఆటకం ఎదుర్తెతుందని గగ్గోలు పెడుతున్నారు.

ఇక అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాలన్నా ఒక్కొక్క సారి పేషెంట్ ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని వాపోతున్నారు.ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఈ గేటును ర్తెల్వే శాఖ ఏర్పాటు చేసింది.

ఆలేరు నుండి జనగామ వైపు వెళ్లాలన్నా,హన్మకొండ నుండి హ్తెదరాబాద్ వెళ్లాలన్నా ఆ నాలుగు గ్రామాలకు ఇదే మార్గంగా ఉండేది.అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గేటును తప్పించి ఆలేరు జనగామ 100 ఫీట్ల డబుల్ రోడ్డు నిర్మించారు.

అదీకాకుండా నాలుగు లైన్లతో ఆలేరు బ్తెపాస్ రోడ్డు కూడా వేశారు.ప్రస్తుతం హైదరాబాద్-హన్మకొండకు వెళ్లె ఆర్టీసి బస్సులు,ప్రైవేట్ వాహనాలు ఆ రోడ్డు మీదనే రాకపోకలు సాగిస్తున్నాయి.

కేవలం గుండ్లగూడెం,శివలాల్ తాండా,పటేల్ గూడెం,శ్రీనివాస్ పురం గ్రామాల ప్రజల రాకపోకలకు మాత్రమే పాత రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.ఆలేరులో ర్తెల్వే స్టేషన్ ఉండడం ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఒకందుకు హైదరాబాద్,హన్మకొండ వంటి దూరపాంతాలకు వెళ్లేవారికి మేలు జరుగుతున్నా,ఆ నాలుగు గ్రామాల ప్రజలు, వ్యాపారస్తులు,విద్యార్థులు,ఉద్యోగులు ఐదు పది నిమిషాలకు గేటుపడి ఒక్కొక్క సారి మూడు నాలుగు రైళ్లు అటు ఇటు పోవడంతో 15,20 నిమిషాలు అక్కడే నిలబడి నరకం అనుభవిస్తున్నారు.

అంతేకాక అప్పుడప్పుడు గేటు రిపేర్లు జరగడం మొత్తం గేటే నాలుగైదు రోజుల వరకు మూసివేయడం జరుగుతుంది.ప్రస్తుతం అక్కడ వర్క్ జరుగుతున్నందున ప్రత్యామ్నాయం మార్గం లేక ఆ గ్రామాల ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు.

తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యామ్నాయ మార్గం లేక ఆలేరు పెద్దవాగును దాటి వెళుతూ గుండ్లగూడెం వైకుంఠ దామం దారిలో వెళ్లుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు.పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ వల్ల రాత్రి ఏడెనిమిది గంటలకు తల్లిదండ్రులు ఆ వాగులో నుండి ఏలా తీసుకుపోతారని, అలాగే ఎగ్జామ్స్ ఉండడంతో రాకపోకలు ఇబ్బంది అయితున్నట్లు గ్రామస్థులు చెప్పుతున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గొడు పట్టించుకొని గుండ్లగూడెం ఎల్ సి 38 గేటు తొలగించి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.లేనిచో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అవసరం అయితే రాబోయే ఎన్నికలలో ఓట్లు వేయకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,ప్రజలు హెచ్చరిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube