బన్నీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తోన్న డైరెక్టర్.. ఎవరంటే?

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, రుద్రమదేవి చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న గుణశేఖర్, తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

 Gunasekhar To Approach Allu Arjun, Gunasekhar, Allu Arjun, Hiranya Kasipa, Rana-TeluguStop.com

హిరణ్య కశ్యపుడి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే కథను పూర్తిగా రెడీ చేసిన ఆయన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టాడు.

అయితే ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అనే అంశానికి రానా దగ్గుబాటి అయితేనే ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తాడని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.కాగా తాజాగా ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే బాగుంటుందని భావించిన గుణశేఖర్, ఈ సినిమాలో నటించాలని ఆయన్ను కోరాడట.

దీనికి బన్నీ ఎలాంటి సమాధానమిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు మైథలాజికల్ చిత్రాన్ని చేయని బన్నీ, ఈ సినిమాతో ఆ లోటు తీరుస్తాడా లేక ఈ సినిమాకు నో అని చెబుతాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఏదేమైనా హిరణ్యకశ్యప పాత్రలో బన్నీ నటిస్తే, ఆ సినిమా ఎలా ఉండబోతుందనే ఆలోచన మెగా ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తిగా మారింది.కాగా బన్నీ ప్రస్తుతం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పక్కా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నాడు.

ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో, ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి పుష్ప అనే సినిమాను చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube