గుల్తాజీ దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.. ఏ రాష్ట్రంలో ఉందంటే..

రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు పది కిలోమీటర్ల దూరంలో గుల్తాజీ దేవాలయం ఉంది.15వ శతాబ్దంలో దివాన్ రావు కృపారావు ఆధ్వర్యంలో దీనిని రాజా సవాయి జై సింగ్నిర్మించడం జరిగింది.

ఈ దేవాలయం 16వ శతాబ్దం నుంచి ధ్యాన యోగులకు ముఖ్యమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెంది ఉంది.

వంద సంవత్సరాలు ఇక్కడే నివసించి తపస్సు చేసిన సాధువు గలవ్ పేరు మీద ఈ దేవాలయానికి ఆ పేరును పెట్టారు.చరిత్రకా కట్టడంగా పేరుగాంచిన గుల్తాజీ దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.

గుల్తాజీ మత విశ్వాసానికి ప్రతికగా స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ఈ దేవాలయ పరిసర ప్రాంతం ప్రశాంతతకు మారుపేరుగా భావిస్తూ ఉన్నారు.ఇక్కడ గాలవు అనే ముని చాలా సంవత్సరాలు తపస్సు చేశాడని అందుకే ఇక్కడ ఈ ప్రధాన దేవాలయాన్ని గాల్తాజీ ఆలయం అని పిలుస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఈ దేవాలయ ప్రాంగణంలోనే బాలాజీ మరియు సూర్యదేవుని దేవాలయాలు కూడా ఉన్నాయి.పూర్తిగా రాతితో నిర్మితమైన ఈ దేవాలయాలు భక్తులకు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.గల్తాజీ లోని దేవాలయాలు గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించబడి ఉన్నాయి.

Advertisement

దేవాలయ సముదాయం చాలా అందంగా నిర్మించబడి ఉంది.రంగు రంగుల పెయింటింగ్ లతో నిండిన డిజైన్ కారిడార్లను కలిగి ఉంది.

ఈ దేవాలయం అప్పటి శిల్పకళా చతుర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భావించవచ్చు.ఈ ప్రాణంగాన్ని ఒక అద్భుతస్థలిగా కొంతమంది మేధావులు అభివర్ణిస్తారు.

పండగల సమయాలలో దేవాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.జైపూర్ నగరానికి దగ్గరలో నిర్మించిన ఈ దేవాలయం మకర సంక్రాంతి సందర్భంగా పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది.

కుటుంబ సమేతంగా వచ్చేవారు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అదృష్టాన్ని తెచ్చే దేవుడు ముందు దీపం వెలిగించడానికి.. ఈ నియమాలు పాటించండి..!

ఆరావళి పర్వతం గుండ ప్రవహించే జలపాతం దేవాలయానికి సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైనది.ఈ బుగ్గలోని నీరు చుట్టుపక్కల అనేక చెరువులలోకి ప్రవహిస్తుంది.దేవాలయ ప్రాంగణంలో ఏడు సహజ నీటి వనరులు కూడా ఉన్నాయి.

Advertisement

ఇక్కడ సందర్శకులు ఎక్కువగా స్థానాలు చేస్తూ ఉంటారు.

తాజా వార్తలు