దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత షణ్ముఖ్ సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్దేశించి అలా పోస్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా అనుమానాలు వస్తుంటాయి.
అయితే తాజాగా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేయగా అది కూడా దీప్తి గురించే అన్నట్లుగా అనిపిస్తుంది.ఇంతకు అతను షేర్ చేసుకున్న పోస్ట్ ఏంటో తెలుసుకుందాం.
యూట్యూబర్ గా షణ్ముఖ్ జశ్వంత్ ఎంతలా పేరు సంపాదించుకున్నాడో చూసాం.యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ అందరు దృష్టిలో పడ్డాడు.కేవలం ఈయనే కాకుండా ఈయనతో పాటు దీప్తి సునయన కూడా నటించింది.దీంతో వారిద్దరూ జోడిని చూసి ప్రతి ఒక్కరు మురిసిపోయారు.
అంతేకాకుండా వీరిద్దరు బుల్లితెరపై పలు షో లలో కూడా పాల్గొని బాగా సందడి చేశారు.
ఇక వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ అనుమానాలు వచ్చాయి.కానీ వీరిద్దరూ మాత్రం తమ మధ్య లవ్ లేదు అని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు.కానీ వీరి మధ్య ఉన్న సన్నిహితం చేస్తే వీరిద్దరూ ప్రేమలో ఉన్న అనుమానాలు మాత్రం తప్పలేదు.
వీరికి సపరేటు ఫ్యాన్ బేస్ కూడా ఉండేది.అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు దీప్తి సునయన ఆ సమయంలో అతడికి ఐ లవ్ యు చెప్పింది.
దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉంది అని క్లారిటీ వచ్చింది.కానీ ఆ ప్రేమ ఎంత కాలం కొనసాగ లేక పోయింది.షణ్ముఖ్ బిగ్బాస్ హౌస్ లో మరో అమ్మాయి సిరి తో బాగా క్లోజ్ గా ఉండటం వల్ల అతడి ప్రవర్తన నచ్చకపోవటంతో అతడు హౌస్ నుండి బయటికి రాగానే మంచి సమయం చూసుకొని బ్రేకప్ చెప్పేసింది.దీంతో ఈ విషయాన్ని తమ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
ఇక ఇప్పటికీ కూడా వీరిద్దరూ కలిసిపోతే బాగుండు అని వీరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.కానీ వీరి మధ్య మాత్రం పూర్తిగా దూరం పెరిగిపోయింది.ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటూ ముందుకు కొనసాగుతున్నారు.అప్పుడప్పుడు వీరిద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్టులు చూస్తుంటే మాత్రం ఒకరికొకరు ఉద్దేశించి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా షణ్ముఖ్ పెట్టిన స్టోరీ కూడా అలాగే ఉంది.తాజాగా షణ్ముఖ్ తన ఇన్ స్టా లో ఒక స్టోరీ పంచుకున్నాడు.
అయితే అందులో.ఎలా అయితే రూ.500, రూ.1000 నోట్లను బ్యాన్ చేశారో.అలాగే ప్రతి మన గర్ల్స్ ఫ్రెండ్స్ లైఫ్ లో రెవి అనే క్యారెక్టర్ ను బ్యాన్ చేయాలి అని స్టోరీ పెట్టాడు.అంటే గత ఏడాది విడుదలైన లవ్ టు డే సినిమాలో రెవి అనే క్యారెక్టర్ ఎలా ఉందో చూసాం.
కాబట్టి అటువంటి క్యారెక్టర్స్ మన గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్ లో ఉండదు అన్నట్లుగా పెట్టాడు. దీంతో ఈ స్టోరీని చూసిన వాళ్లంతా దీప్తి సునైన ఉద్దేశించి పెట్టాడేమో అని అనుకుంటున్నారు.