నారా లోకేష్ చొరవ.. ఆ నరకం నుంచి విముక్తి, ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.

ఇటీవల గల్ఫ్ దేశం కువైట్‌లో( Kuwait ) నరకయాతన అనుభవిస్తున్న శివ( Shiva ) అనే ఓ తెలుగు వ్యక్తి అక్కడి బాధలను చెబుతూ తనను కాపాడాలని వీడియో సందేశాన్ని పంపాడు.

ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి దృష్టికి వచ్చింది.దీనిపై స్పందించిన లోకేష్.

శివను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని( TDP NRI Cell ) ఆదేశించారు.

లోకేష్ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు శివ కోసం తీవ్రంగా గాలించారు.అయితే సదరు వీడియోలో ఎడారి ప్రదేశం తప్పించి తాను ఎక్కడున్నది మాత్రం వెల్లడించలేదు.దీంతో అతని ఆచూకీ కనుగొనడం కష్టమైంది.

Advertisement

అయినప్పటికీ రెండు రోజుల పాటు కువైట్‌లో గాలించి ఎట్టకేలకు శివ ఆచూకీని కనుగొన్నారు.అక్కడి నుంచి భారతదేశానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం కువైట్ నుంచి తన స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నాడు శివ.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను స్వగ్రామానికి రావడానికి లోకేష్ చేసిన కృషి మరవలేనిదని.తమ కుటుంబం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటుందని శివ కన్నీటి పర్యంతమయ్యారు.

శివ అనే వ్యక్తికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో శివ కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.రాయచోటికి చెందిన ఓ ఏజెంట్‌ ద్వారా శివ నెల రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు.

పాము చేసిన పనికి అమెరికాలో 11 వేల మందికి ఇబ్బంది..?
అనుష్క-ఎన్టీఆర్‌ల మధ్య పెద్ద గొడవ.. అందుకే ఒక్క సినిమా కూడా చేయలేదు..?

అక్కడ ఏడారి ప్రాంతంలో( Desert ) కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో చేరాడు.కనుచూపు మేరలో జనసంచారం లేకపోవడం, యజమానులు కనీసం వచ్చి చూడకపోవడం, ఆహారం, నీటిని అందించకపోవడంతో శివ మానసికంగా కృంగిపోయాడు.

Advertisement

ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని.తనకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేస్తోంది ఒకటని .చుట్టూ ఇసుక దిబ్బలు తప్పించి మాట్లాడేందుకు ఒక్క మనిషి కూడా లేడని శివ ఆవేదన వ్యక్తం చేశారు.ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతిందని, ఇంకో రెండ్రోజులు ఇక్కడుంటే చనిపోతానని తనను రక్షించాలని శివ కన్నీటితో ఓ వీడియో చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.

తాజా వార్తలు